ఉన్నట్టుండి నటి విజయలక్ష్మి యూటర్న్.. సీమాన్ పై కేసు వెనక్కి, ఇక ఆయన జోలికి వెళ్ళను అంటూ..

Published : Sep 17, 2023, 12:41 PM IST
ఉన్నట్టుండి నటి విజయలక్ష్మి యూటర్న్.. సీమాన్ పై కేసు వెనక్కి, ఇక ఆయన జోలికి వెళ్ళను అంటూ..

సారాంశం

ప్రముఖ నటి విజయలక్ష్మి, నామ్‌ తమిళర్‌ కట్చి అధ్యక్షుడు సీమాన్‌ మధ్య వివాదం కొన్ని రోజులుగా మీడియాలో నిలుస్తోంది. తనని వివాహం చేసుకుని మోసం చేశాడని సీమాన్ పై విజయలక్ష్మి మీడియా ముఖంగా ఆరోపణలు చేస్తోంది.

ప్రముఖ నటి విజయలక్ష్మి, నామ్‌ తమిళర్‌ కట్చి అధ్యక్షుడు సీమాన్‌ మధ్య వివాదం కొన్ని రోజులుగా మీడియాలో నిలుస్తోంది. తనని వివాహం చేసుకుని మోసం చేశాడని సీమాన్ పై విజయలక్ష్మి మీడియా ముఖంగా ఆరోపణలు చేస్తోంది. ఇటీవల ఆమె గ్రేటర్ చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సీమాన్ పై ఫిర్యాదుకూడా చేసింది.

కానీ అనూహ్యంగా సీమాన్ పై తన కేసు విత్ డ్రా చేసుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేసింది.  శుక్రవారం అర్ధరాత్రి వలసరవాక్కం పోలీసుస్టేషన్‌ కి విజయలక్షి వెళ్లారు. సీమాన్ పై కేసు వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఇలా సంచలన ఆరోపణలు చేయడం ఫిర్యాదు వెనక్కి తీసుకోవడం విజయలక్ష్మి కి కొత్త కాదు. గతంలో 2012లో కూడా విజయలక్ష్మి పోలీస్ ఫిర్యాదు చేసి కేసు వెనక్కి తీసుకుంది. 

సీమాన్ పై ఉన్నపళంగా యూటర్న్ తీసుకోవడానికి విజయలక్మి కారణం వివరించింది. ఇంతకాలం తనకి అండగా ఉంటూ వచ్చిన యాక్టివిస్ట్ వీరలక్ష్మి సడెన్ గా ప్లేటు మార్చేసింది. ఇంతకాలం ఆమె ఇంట్లోనే భద్రతతో ఉన్నాను. కానీ ఇప్పుడు ఆమె తన ఇంటి నుంచి వెళ్లిపొమ్మని చెప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో ఒంటరిగా సీమాన్ పై పోరాటం చేయలేను. అందుకే కేసు వెనక్కి తీసుకుంటున్నట్లు విజయలక్ష్మి పేర్కొన్నారు. 

సీమాన్ చాలా శక్తివంతుడు. రాజకీయంగా, ఆర్థికంగా అతడిని ఎదుర్కొనడం కష్టం అని విజయలక్ష్మి పేర్కొంది. కేసు విచారణ కూడా నత్తనడకగా సాగుతోంది. తాను కేసు నమోదు చేసి ఇంతకాలం గడుస్తున్నా ఒక్కరోజు కూడా సీమాన్ ని పోలీస్ స్టేషన్ కి రప్పించలేకపోయాను అని విజయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది. ఇకపై తాను సీమాన్ జోలికి కూడా వెళ్లనని విజయలక్ష్మి తేల్చేసింది. 

2008లో సీమాన్ తో తనకి వివాహం జరిగినట్లు విజయలక్ష్మి ఆరోపిస్తోంది. కానీ అతడు తనని మోసం చేయడం కాక తన మనుషులతో బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నాడు అంటూ విజయలక్ష్మి తెలిపింది. మీడియాతో మాట్లాడుతూ బోరున ఏడ్చేసింది. గతకొన్నేళ్ళుగా నేను సీమాన్ పై పోరాటం చేస్తున్నాను. కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు అంటూ గతంలో విజయలక్ష్మి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

Emmanuel: కట్టే కాలే వరకు ఎంటర్‌టైన్‌ చేస్తా.. బిగ్‌ బాస్‌ మాటలకు ఇమ్మాన్యుయెల్‌ కన్నీటి పర్యంతం
Yogibabu బ్రహ్మానందం కలిసి వస్తే.. నవ్వులు సునామీ వచ్చేది ఎప్పుడంటే?