అమేజింగ్ న్యూస్.. ప్రీతి జింతాకు కవల పిల్లలు జననం, భలే పేర్లు పెట్టేసింది

By telugu team  |  First Published Nov 18, 2021, 12:50 PM IST

బాలీవుడ్ లో ప్రీతి జింతా సొట్టబుగ్గల సుందరిగా గుర్తింపు సొంతం చేసుకుంది. తన అందం, అభినయంతో నటిగా తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది ప్రీతి జింతా. చాలా కాలం క్రితమే ప్రీతి జింతా నటనకు గుడ్ బై చెప్పేసింది. 


బాలీవుడ్ లో ప్రీతి జింతా సొట్టబుగ్గల సుందరిగా గుర్తింపు సొంతం చేసుకుంది. తన అందం, అభినయంతో నటిగా తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది ప్రీతి జింతా. చాలా కాలం క్రితమే ప్రీతి జింతా నటనకు గుడ్ బై చెప్పేసింది. అప్పుడప్పుడూ గెస్ట్ రోల్స్ తో సినిమాల్లో మెరుస్తోంది అంతే. 

ఇదిలా ఉండగా తాజాగా Preity Zinta క్రేజీ న్యూస్ ని అభిమానులతో పంచుకుంది. ప్రీతి జింతా అభిమానులకు ఇది పెద్ద సర్ ప్రైజ్ అనే చెప్పాలి. 2016లో ప్రీతి జింతా ఫారెన్ బిజినెస్ మ్యాన్ ని వివాహం చేసుకుని లాస్ ఏంజిల్స్ లో సెటిల్ అయింది. ప్రీతి జింతా భర్త పేరు జీన్ గుడెనఫ్. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ప్రీతి జింతా, జీన్ దంపతులు కవల పిల్లలకు తల్లిదండ్రులు అయ్యారు. 

Latest Videos

దీనితో ప్రీతి జింతా ఫ్యామిలిలో సంతోషానికి అవధులు లేకుండా పోయింది. ఈ హ్యాపీ న్యూస్ ని స్వయంగా ప్రీతి జింతా సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంది. సరోగసి విధానం ద్వారా ప్రీతి జింతా, జీన్ దంపతులకు కవల పిల్లలు జన్మించారు. 

'హాయ్.. ఈరోజు మీతో నేను ఒక అమేజింగ్ న్యూస్ షేర్ చేసుకోబోతున్నాను. నేను, జీన్ ఎంతో సంతోషంతో ఈ వార్తని ప్రకటిస్తున్నాం. మా జీవితాల్లో సంతోషం, వెలుగు నిండేలా కవల పిల్లలని పొందాము. ఈ కొత్త ప్రయాణం మాకు ఎంతో సంతోషంగా ఉంది. సరోగసి ద్వారా మాకు పిల్లలు పుట్టడంలో సహకరించిన డాక్టర్లు, నర్సులకు ధన్యవాదాలు' అని ప్రీతి జింతా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Preity G Zinta (@realpz)

తన కవల పిల్లలకు 'జై జింతా గుడెనఫ్', 'జియా జింతా గుడెనఫ్' అని అందమైన పేర్లతో నామకరణం చేసినట్లు ప్రీతి జింతా ప్రకటించింది. ప్రీతి జింతా 1998లో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ప్రీతి జింతా ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ జట్టుకు కో ఓనర్ గా వ్యవహరిస్తున్నారు. ఐపీఎల్ ద్వారా ప్రీతి జింతా వ్యాపార రంగంలో కూడా రాణిస్తోంది.  

Also Read: హాట్ అలెర్ట్.. బ్రాలో ఇలియానా అందాల విందు, పార్టీలో మెరిసిన హాట్ బ్యూటీ

click me!