Prabhas: అభిమాని చేసిన పనికి ప్రభాస్ ఫిదా... ఖరీదైన వస్తువు గిఫ్ట్ గా ఇచ్చిన డార్లింగ్!

Published : Nov 18, 2021, 12:18 PM IST
Prabhas: అభిమాని చేసిన పనికి ప్రభాస్ ఫిదా... ఖరీదైన వస్తువు గిఫ్ట్ గా ఇచ్చిన డార్లింగ్!

సారాంశం

అభిమానానికి హద్దులు ఉండవు. ప్రాణం మిన్నగా కంటే ప్రేమించే తమ హీరో కోసం ఏమి చేయడానికైనా అభిమానులు సిద్ధంగా ఉంటారు. అలాంటి డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్న హీరోలలో ప్రభాస్ ఒకరు. ఇక అభిమానికి ఖరీదైన బహుమతి ఇచ్చిన ప్రభాస్ తన ప్రత్యేకత చాటుకున్నారు.   

తెరపై  హీరోయిజం చూసి ప్రాణప్రదంగా అభిమానించే ఫ్యాన్స్ ని మనం ఇండియాలోనే చూడగలం. అభిమాన హీరోలను దేవుడితో సమానంగా పూజించే ఈ ఫ్యాన్స్... తమ అభిమానం చాటుకోవడానికి పలు మార్గాలు ఎంచుకుంటారు. తమ ప్రేమ ఆరాధించే హీరోకి తెలియాలని తాపత్రయం పడుతూ ఉంటారు. తాజాగా ప్రభాస్ (Prabhas) ఫ్యాన్ ఒకరు ఇలాగే వార్తల్లో నిలిచాడు. సదరు అభిమాని తన తలపై ప్రభాస్ పేరును క్రాప్ చేయించుకున్నాడు. చుట్టూ ఉన్న జుట్టు తొలగించి, తలపై భాగంలో ప్రభాస్ పేరు డిజైన్ వచ్చేలా హెయిర్ కట్ చేయించారు. 


ఈ వార్త ప్రభాస్ వరకు చేరింది. అభిమాని ప్రేమకు ఇంప్రెస్ అయిన ప్రభాస్ అతనిని తన నివాసానికి ఆహ్వానించాడు. తన పక్కనే కూర్చొని చాలా సమయం ముచ్చటించారు. విశేషం ఏమిటంటే తన వద్ద ఉన్న ఓ లగ్జరీ వాచ్ ని ఆ ఫ్యాన్ కి బహుమతిగా ఇవ్వడం జరిగింది. అభిమానికి ఖరీదైన వస్తువు గిఫ్ట్ గా ఇచ్చిన ప్రభాస్ ఔదార్యాన్ని, మంచితనాన్ని ఇండస్ట్రీ వర్గాలు ప్రముఖంగా కొనియాడుతున్నాయి. 

భోళా శంకరుడుగా ప్రభాస్ కి పేరుంది. విపత్తుల సమయంలో టాలీవుడ్ హీరోలు అందరి కంటే ప్రభాస్ ఎక్కువ మొత్తం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు దానం చేశారు. ఇక తన సినిమాలలో పని చేసే నటులకు అరుదైన వంటకాలతో విందు భోజనాలు ఏర్పాటు చేయడం ప్రభాస్ కి అలవాటు. ప్రభాస్ తో పని చేసిన హీరోయిన్స్, నటులు ఇప్పటికే పలు మార్లు ఈ విషయాన్ని తెలియజేశారు. 

Also read 'రాధే శ్యామ్': అలా అయితే నిర్మాత‌ల‌పై కంప్లైంట్ ఇవ్వండంటూ పోలీస్
ఇక ఆదిపురుష్, రాధే శ్యామ్ (Radhe shyam)చిత్రాల షూటింగ్ పూర్తి చేశారు ప్రభాస్. పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఆదిపురుష్ ఆగష్టు నెలలో విడుదల కానుంది. కాగా రాధే శ్యామ్ సంక్రాంతి కానుకగా... జనవరి 14న విడుదల చేస్తున్నారు. పూజా హెగ్డే (Pooja hegde)హీరోయిన్ గా నటిస్తున్న ఈ పీరియాడిక్ ఎమోషనల్ లవ్ డ్రామాకి , రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ (Salaar) సెట్స్ పై ఉంది. అలాగే మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కె.. షూటింగ్ మొదలుపెట్టాల్సి ఉంది. దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ తో ప్రాజెక్ట్ కె... ని సీనియర్ నిర్మాత అశ్విని దత్ నిర్మిస్తున్నారు. 

Also read Radheshyam: పాటలోనే కథ అంతా లీక్‌... `మగధీర`స్టోరీని దించేశారా? ప్రూఫ్స్‌ ఇవే..

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Ilaiyaraaja Secrets: మణిరత్నంను పరిచయం చేసింది నేనే.. ఇళయరాజా సంచలన వ్యాఖ్యలు!
Rajinikanth Remuneration: కమల్‌ హాసన్‌తో సినిమాకి రజనీకి రికార్డ్ రెమ్యూనరేషన్‌.. ఇండియాలోనే టాప్‌