Shyam Singha Roy Teaser: స్త్రీ ఎవడికి దాసి కాదు, ఆఖరికి దేవుడికి కూడా..మీసం తిప్పిన నాని

By telugu team  |  First Published Nov 18, 2021, 11:19 AM IST

నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం శ్యామ్ సింగ రాయ్. టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంస్కృత్యాన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించారు. 


నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం శ్యామ్ సింగ రాయ్. టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంస్కృత్యాన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా Shyam Singha Roy Teaser విడుదల తేదీ ప్రకటిస్తూ టీజర్ కూడా విడుదల చేశారు. ముందుగా అనుకున్నట్లుగా క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 24న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. 

ఇక టీజర్ విషయానికి వస్తే ఒక నిమిషం 45 సెకండ్ల నిడివి ఉన్న టీజర్ లో విజువల్స్ అద్భుతంగా చూపించారు. అప్పటి పరిస్థితులు, మూఢనమ్మకాలపై పోరాటం చేసే వ్యక్తిగా బెంగాల్ యువకుడిగా నాని కనిపిస్తున్నాడు. ఈ చిత్ర కథ రెండు పీరియడ్స్ లలో జరగనుంది. నాని పోషిస్తున్న బెంగాల్ యువకుడి పాత్ర ఒకటి కాగా మరొకటి.. ప్రజెంట్ కథ. 

Latest Videos

ప్రజంట్ కథలో నాని, కృతి శెట్టి ప్రేమని చూపించబోతున్నారు. ఇక నాని బెంగాల్ యువకుడిగా దేవదాసి వ్యవస్థపై పోరాటం చేస్తూ కనిపిస్తున్నాడు. టీజర్ లో బెంగాల్ భాషలోనే నాని డైలాగులు ఉన్నాయి. ' స్త్రీ ఎవడికి దాసి కాదు, ఆఖరికి దేవుడికి కూడా' అంటూ నాని మీసం మెలేస్తూ డైలాగ్ చెబుతున్న విధానం ఆకట్టుకుంటోంది. 

 

సాయి పల్లవి పాత్రని ఆధ్యాత్మిక మార్గంలో పవర్ ఫుల్ గా చూపిస్తున్నారు. టీజర్ లో దర్శకుడు రొమాంటిక్ టచ్ కూడా ఇచ్చాడు. టీజర్ లో నాని, కృతి శెట్టి లిప్ లాక్ సన్నివేశం కూడా ఉంది. ఈ చిత్రంలో దర్శకుడు రాహుల్ నాని కోసం పవర్ ఫుల్ డైలాగులు రాసినట్లు ఉన్నారు. విజువల్స్ చూస్తుంటే రాహుల్ పెద్ద ప్రయత్నమే చేసినట్లు అనిపిస్తోంది. 

ఇక టీజర్ లో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంది. మిక్కీ జె మేయర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వెంకట్ బోయినపల్లి ఈ చిత్రాన్ని నిర్మించారు. 

click me!