
ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మేనియాతో తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులు ఊగిపోతున్నారు. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూద్దామా అని వారందరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేలా చిత్ర యూనిట్ దేశవ్యాప్తంగా భారీ ప్రమోషన్స్ చేస్తూ ఆర్ఆర్ఆర్‌పై క్రేజ్‌ను అమాంతం పెంచేశారు. స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఈ పీరియాడికల్ ఫిక్షన్ మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో RRR బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపధ్యంలో ఓ వార్త చిత్ర టీమ్ ని టెన్షన్ లో పడేస్తోంది.
నార్త్ లో ప్రమోషన్ టూర్స్ వేస్తూ ...ఎంత బజ్ క్రియేట్ చేస్తున్నా.. ఫుల్ స్వింగ్ లో ప్రమోషన్స్ చేస్తున్నా అనుకున్న ఊపు రావటం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఆడియెన్స్ చూపిస్తున్నంత క్రేజ్ మిగిలిన రాష్ట్రాల్లో లేకపోవటం టీమ్ ని టెన్షన్ లో పడేస్తోంది. ఈ సినిమా రిలీజై టాక్ వచ్చాక పరిస్థితి మారుతుందేమో చెప్పలేం కానీ ఇప్పుడికైతే ప్రీ రిలీజ్ బుక్కింగ్స్ నార్త్ లో చాలా డల్ గా ఉన్నాయి.
ట్రిపుల్ ఆర్ మేనియా కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితమైనట్టు అనిపిస్తోంది. నార్త్ బెల్ట్ ఆడియెన్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సల్మాన్, ఆమీర్, కరణ్ జోహార్ లాంటి బాలీవుడ్ స్టార్స్ సపోర్ట్ ఉన్నా.. తెలుగు నుంచి వస్తున్న రీజనల్ సినిమాగానే ట్రిపుల్ ఆర్ ను అక్కడి ప్రేక్షకులు ట్రీట్ చేస్తున్నారు. ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ పెద్గగా లేవు. దాంతో రాజమౌళి ప్రమోషన్స్ ప్లాన్ పెద్దగా వర్కవుట్ కాలేదని అంచనాలు వేస్తున్నారు.
ఈ సమస్య ఒక్క నార్త్ లోనే కాదు.. కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో సైతం కనపడుతోంది. అక్కడా ట్రిపుల్ ఆర్ కు ఊపు పెద్దగా కనిపించట్లేదు. బాహుబలి2 తర్వాత ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా లెవల్ లో పాగా వేయాలనుకున్న జక్కన్నకు ఈ సినిమా బ్రేక్ వేస్తుందా అంటున్నారు. మన దగ్గర మొదటి మూడు రోజులు అడ్వాన్స్ బుకింగ్ దూసుకుపోయింది. కానీ మిగిలిన రాష్ట్రాల్లో రిలీజై పాజిటివ్ టాక్.. మ్యాసివ్ హిట్ కొడితేనే థియేటర్ దాకా ఆడియెన్స్ వచ్చేలా కనిపిస్తున్నారు. అందుకు కారణం ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు నేషన్ వైడ్ మార్కెట్ లేకపోవటమే అంటున్నారు.
రాజమౌళి మాట్లాడుతూ... బలమైన భావోద్వేగాలుంటే ఎక్కువమంది ప్రజలు మన సినిమాను ఇష్టపడతారని నా కెరీర్ ప్రయాణంలో నేర్చుకున్నా. అదే నేనిపుడు చేస్తున్నానన్నాడు రాజమౌళి. బాహుబలి సినిమాను దేశమంతా ఎలా ఇష్టపడిందని చూసినపుడు, మానవ భావోద్వేగాల ఆధారంగా రాసుకున్న కథలను సినిమాలుగా తీస్తే..ఫలితం బాహుబలిలా ఉంటుందని తెలుసుకున్నట్టు చెప్పాడు. కొన్ని సినిమాలు (ఇతర పాన్ ఇండియా సినిమాలు) బాగా ఆడుతున్నాయి. వారి సినిమాలు సక్సెస్‌ఫుల్ అవుతున్నందుకు జక్కన్న చాలా సంతోషంగా ఉందన్నారు.