
దర్శకుడు ప్రశాంత్ వర్మ.. ప్రస్తుతం `హనుమాన్` చిత్రంతో రాబోతున్నాడు. గతంలో ఆయన `అ!`, కల్కి`, `జాంబిరెడ్డి` వంటి చిత్రాలతో అలరించాడు. దర్శకుడిగా తానేంటో నిరూపించుకున్నాడు. ఆహాలో వచ్చే బాలయ్య `అన్‌స్టాపబుల్` టాక్ షోని కూడా డీల్ చేసేది ప్రశాంత్ వర్మనే. అలాగే `ఆదిపురుష్` ప్రీ రిలీజ్ ఈవెంట్ కాన్సెప్ట్ ని కూడా ఆయనే డిజైన్ చేశాడు. ఇలా క్రియేటివ్ టెక్నీషియన్‌గా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. నిరూపించుకుంటున్నాడు.
ప్రస్తుతం తేజ సజ్జాతో `హనుమాన్` చిత్రాన్ని రూపొందించాడు. ప్రస్తుతం జనరేషన్‌కి, హనుమంతుడితో కూడిన మైథాలజీ అంశాలను జోడిస్తూ ఈ మూవీని రూపొందించాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. వరలక్ష్మి శరత్ కుమార్ ఇందులో కీలక పాత్ర పోషిస్తుంది. సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 12న ఈ మూవీ రిలీజ్ కానుంది. మహేష్‌బాబు `గుంటూరు కారం` కి పోటీగా రాబోతుంది. పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న నేపథ్యంలో రిలీజ్ డేట్‌లో మార్పు చేయడం లేదు. కంటెంట్ పరంగా మేకర్స్ కి కాన్ఫిడెంట్‌గా ఉండటంతో సంక్రాంతి బరిలోకి దిగేందుకే సిద్ధమయ్యారు.
ఇక సినిమాకి సంబంధించిన ప్రోమోషనల్ కార్యక్రమాలు షురూ చేశారు. ఇందులో భాగంగా అడవి శేష్‌తో కలిసి చిట్ చాట్‌లో పాల్గొన్నారు దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జా. ఈ సందర్భంగా అసలు విషయం బయటపెట్టాడు హీరో తేజ సజ్జా. ఈ సినిమాతోపాటు ఇదొక యూనివర్స్ లాగా రాబోతున్నట్టు హింట్ ఇచ్చాడు. దీనికి దర్శకుడు ప్రశాంత్ వర్మ రియాక్ట్ అవుతూ ఈ సినిమాని సినిమాటిక్ యూనివర్స్ లాగా తీసుకురాబోతున్నట్టు తెలిపారు.
ఈ సిరీస్ నుంచి 12 మూవీస్ రానున్నాయట. ఇప్పుడు `హనుమాన్`, నెక్ట్స్ `అధీర` పేరుతో సినిమాని తెరకెక్కించనున్నట్టు తెలిపారు. ఇలా 12 మంది సూపర్ హీరోలను పరిచయం చేయబోతున్నట్టు తెలిపారు. ఇక తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ మూవీ `యూ/ఏ సర్టిఫికేట్‌ని పొందింది. దీంతో రిలీజ్ డేట్ ఖారారైంది.