Umapathi Movie Review : అవికాగోర్ ‘ఉమాపతి’ మూవీ రివ్యూ!

By Nuthi SrikanthFirst Published Dec 29, 2023, 6:35 PM IST
Highlights

చిన్నారి పెళ్లి కూతురు ఫేమ్, యంగ్ హీరోయిన్ అవికా గోర్ Avika Gor  కథానాయికగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఉమాపతి’ Umapathi. పల్లెటూరి ప్రేమకథగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిత్ర ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం..

పల్లెటూరి ప్రేమకథగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం Umapathi.  అనురాగ్ కొణిదెల Anurag Konidela హీరోగా నటించగా.. చిన్నారి పెళ్లికూతురు ఫేమ్ అవికా గోర్ Avika Gor హీరోయిన్‌గా నటించారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లోని ఈ బ్యూటీ ఫుల్ లవ్ స్టోరీ ప్రేక్షకులను అలరించిందా? లేదా? ఇంతకీ సినిమా కథ ఏంటీ, ఎలా ఉందనే విషయాలను సమీక్షలో తెలుసుకుందాం. 

కథ :  

తండ్రి విదేశాల్లో కష్టపడుతుంటే ఊర్లో అల్లరిచిల్లరగా తిరిగే ఓ యువకుడి కథే ఈ చిత్రం. పైగా ఈ సినిమా రెండు గ్రామాలు దోసకాయలపల్లి, కొత్తపల్లి మధ్య జరుగుతుంది. ఈరెండు గ్రామాలకు అస్సలు పడదు. వర (అనురాగ్) కొత్తపల్లి గ్రామస్తుడు. ఆయన తండ్రి దుబాయ్ లో కష్టపడుతుంటాడు. ఇంటికి డబ్బులు పంపిస్తుంటాడు.వర మాత్రం ఎలాంటి లక్ష్యం లేకుండా ఊర్లోనే తిరుగుతుంటాడు. కానీ వర జీవితంలోకి ఓ అమ్మాయి వస్తుంది. ఆమె ఉమా (అవికాగోర్). దోసకాయలపల్లికి చెందిన అమ్మాయి. ఆయనకు అన్నయ్య ఉంటాడు. అప్పటికే ఆ ఊరికీ ఈ ఊరికీ వైరం కొనసాగుతుంటే.. వర పక్క ఊరి అమ్మాయి ఉమాను ప్రేమిస్తుంటాడు. అప్పటికే వాళ్ల అన్నతోటి గోడవ జరిగి ఉంటుంది. ఈ క్రమంలో వారి ప్రేమ గెలుస్తుందా? అసలు ఆ రెండు ఊర్ల మధ్య ఉన్న గొడవలేంటీ? వర ప్రేమలో ఉమా ఎలా పడుతుంది? తమ ప్రేమను గెలిపించుకోవడానికి ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటారనేది? మిగితా కథ. 

విశ్లేషణ : 

ఈ కథ మూలం తీసుకుంటే కొద్దిగా ఎన్టీఆర్ ‘బృందావనం’ సినిమాను గుర్తుచేస్తుంటుంది. రెండూర్ల మధ్య వైర్యం ఓవైపు, ప్రేమ మరోవైపు ఈ రెండు అంశాలు ‘ఉమాపతి’ చిత్రంలో ప్రధాన అంశాలు. కానీ దర్శకుడు సింపుల్ కథను మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మలిచాడు. ఇంలాంటి స్టోరీలు ఇది వరకు ఎన్నో వచ్చినా.. ఈ చిత్రం కాస్త రీఫ్రెషింగ్‌గా కూడా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో హీరో హీరోయిన్ల గిల్లికజ్జాలు, ఇద్దరి మధ్య ప్రేమ చిగురించే సన్నివేశాలు.. పల్లెటూరి వాతావరణం, గొడవలు, అక్కడక్కడ కామెడీ సీన్లతో ఆకట్టుకుంటుంది. ప్రథమార్థం అలా సరసరదాగా గడిచిపోతుంది. ఇంటర్వెల్ చిన్న ట్విస్ట్ తో ఫస్టాఫ్ ముగుస్తుంది. 

ఇక అసలు సినిమా కథ సెకండాఫ్‌లోనే నడుస్తుంది.  అసలైన ఘర్షణ ఇక్కడే మొదలవుతుంది. రెండు ఊర్ల మధ్య ఉన్న గొడవ ఏంటి? ఆ గొడవకు ఈ ప్రేమ కథకు ఎలా ముడి పెట్టారు.. అనే సందేశాలకు క్లారిటీ వస్తుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ కాస్త ఎమోషనల్‌గా సాగుతుంది. ప్రథమార్థంతో పోల్చితే ద్వితీయార్థం కాస్తా మెరుగని చెప్పాలి.  కొంత ప్రేక్షకులను ఆకట్టుకునే సన్నివేశాలు ఉంటాయి. మూవీ కథ రోటీన్ గా ఉండటంతో సన్నివేశాలు కూడా ముందే అర్థమవుతుంటాయి. కానీ కాస్తా కొత్తగా చూపించే ప్రతయ్నం చేశారు. చివరకు తెలుగు సినిమాల్లో ఉండే రెగ్యులర్ ముగింపులానే ఈ సినిమాకు కూడా ఎండ్ కార్డు పడుతుంది. కొన్ని కామెడీ, ఎమోషనల్, రొమాంటిక్ సీన్లు ఆకట్టుకుంటాయి. 

నటీనటులు. టెక్నీకల్ : 

ప్రధాన పాత్రలో నటించిన అనురాగ్, అవికాగోర్ తమ పెర్పామెన్స్ తో ఆకట్టుకున్నారు.వీరిమధ్యనే ఎక్కువ సన్నివేశాలు ఉండటంతో ఇద్దరూ చక్కగా నటించారు. యాక్షన్, కామెడీ, రొమాన్స్ ఇలా అన్ని ఎమోషన్స్‌ను పలికించారు. అనురాగ్ తన నటనతో ఆకట్టుకున్నారు. అవికా గోర్ పల్లెటూరి అమ్మాయిలాగా చాలా అందంగా కనిపించారు. వీరిద్దరి జోడికి ప్రేక్షకులు కచ్చితంగా ఆకర్షితులవుతారు. మిగిలిన పాత్రలు కూడా తమ పరిధి మేరకు మెప్పిస్తాయి. ఇక టెక్నీకల్ పరంగా.... సినిమాలో పాటలు, ఆర్ఆర్ ఆకట్టుకుంటుంది. విజువల్స్ కూడా బాగున్నాయి. కొన్ని డైలాగ్స్ గుండెల్ని హత్తుకునేలా ఉంటాయి. ఎడిటింగ్ షార్ప్‌గా ఉంటుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. 

రేటింగ్‌ః 2.5

సినిమా : ఉమాపతి
నిర్మాత : కే.కోటేశ్వర రావు 
బ్యానర్ :  క్రిషి క్రియేషన్స్
నటీనటులు : అనురాగ్ కొణిదెల, అవికా గోర్, పోసాని, ఆటో రామ్ ప్రసాద్, ప్రవీణ్, బద్రం, 
దర్శకుడు : సత్య ద్వాపరపుడి
రిలీజ్ డేట్ : 29 - 12 - 2023 

click me!