ప్రణీత సైడ్ బిజినెస్ చేస్తోంది.. సంపాదించాలంటే తప్పదు

Published : May 15, 2017, 11:37 AM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
ప్రణీత సైడ్ బిజినెస్ చేస్తోంది.. సంపాదించాలంటే తప్పదు

సారాంశం

ఇటీవల బిజినెస్ పీపుల్ గా మారిపోతున్న టాలీవుడ్ హీరోయిన్లు నటనతోపాటు రకుల్ తదితర హీరోయిన్ల సైడ్ బిజినెస్ అదే కోవలో సినీ నిర్మాతగా మారనున్న ప్రణీత  

ఈ మధ్య మన హీరోయిన్లు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనుకున్న నానుడిని పక్కా ఫాలో అవుతున్నారు మన యంగ్ హీరోయిన్లు. తెలుగులో హీరోయిన్స్ గా యమా క్రంజ్ సంపాదించుకున్న పలువురు హీరోయిన్లు తమకు నచ్చిన రంగంలో వ్యాపారం చేస్తూ సక్సెస్ అవుతున్నారు. ఆ కోవలో ఇటీవల రకుల్ ప్రీత్ సింగ్ జిమ్ అండ్ ఫిట్ నెస్ బిజినెస్ ను సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తోంది. 

 

ఇలా తమ సంపాదనను ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులుగా పెడుతున్న కథానాయికల్లో మరో హీరోయిన్ చేరింది. రకుల్ జిమ్ బిజినెస్ లో సక్సెస్ అవుతుండగా కొంతమంది జ్యుయలరీ బిజినెస్ లో.. మరికొంతమంది డైమండ్స్ బిజినెస్ లో . . ఇంకొంతమంది హోటల్ బిజినెస్ లో పెట్టుబడులు పెడుతూ లాభాలు సంపాదిస్తున్నారు. ఈ బిజినెస్ లు కాకుండా సినిమాలను నిర్మించే బాధ్యతను తలకెత్తుకోవడానికి కూడా కొంతమంది సిద్ధమవుతున్నారు. అలాంటి కథానాయికల జాబితాలో తాజాగా ప్రణీత కనిపిస్తోంది.

 తెలుగులో కొన్ని సినిమాలు చేసిన ప్రణీతకి, అత్తారింటికి దారేది' .. ' పాండవులు పాండవులు తుమ్మెద' సినిమాలు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఇక కన్నడలోను తన సత్తా చాటుకోవడానికి ఆమె తన వంతు కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మధ్య హోటల్ బిజినెస్ ను ఆరంభించిన ప్రణీత, అందులో లాభాల బాటలో దూసుకుపోతోందట. దాంతో నిర్మాతగా మారిపోయి .. స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించడానికి రెడీ అవుతోందని అంటున్నారు. త్వరలోనే తన సొంత బ్యానర్ పై ఒక సినిమాను ఎనౌన్స్ చేయనుందని అంటున్నారు.

PREV
click me!

Recommended Stories

Chiranjeevi, Mahesh Babu సినిమాలతో పోటీ పడి టాప్ 5లో నిలిచిన హీరో, టాలీవుడ్ రాజకీయాలపై ఓపెన్ కామెంట్స్
Thalapathy Vijay సినిమా స్టోరీ లీక్, జన నాయగన్ కథ ఇదేనా? షాక్ లో మూవీ టీమ్