సినీ నటులు రాజకీయాల్లోకి రావడం మన దౌర్భాగ్యం-ప్రకాష్ రాజ్

First Published Nov 12, 2017, 2:21 PM IST
Highlights
  • తనకు ఏ రాజకీయ పార్టీలో చేరాలనే ఉద్దేశం లేదన్న ప్రకాష్ రాజ్
  • సినీ నటులు రాజకీయాలల్లో చేరడం మన దౌర్భాగ్యమంటున్న ప్రకాశ్ రాజ్
  • అభిమానులుంటారు, అంత మాత్రాన రాజకీయాలు చేయలేరు-ప్రకాష్ రాజ్

సినీనటులు రాజకీయాల్లో చేరి రాణించడం తరతరాలుగా వస్తున్నదే. తాజాగా ఏపీలో పవన్ కళ్యాణ్ ఇప్పటికే జనసేన పార్టీని ఏర్పాటు చేయగా, కన్నడ నాట ఉపేంద్ర కూడా పార్టీ ఏర్పాటు చేశారు. తమిళనాట కమల్ హాసన్, రజనీ కాంత్ రాజకీయ పార్టీల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

 

కేంద్ర ప్రభుత్వ విధానాల్ని గత కొంత కాలంగా తీవ్రంగా తప్పుబడుతున్న సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఈసారి తోటి నటులపై విమర్శలు చేశారు. మీరు రాజకీయాల్లో వస్తారా అనే ప్రశ్నకు బదులిస్తూ.. తనకు అలాంటి ఉద్దేశమేం లేదని తేల్చి చెప్పారు. ఏ రాజకీయ పార్టీలోనూ తాను చేరబోనని స్పష్టం చేశారు.

 

రాజకీయాల్లోకి సినిమా నటులు రావడం పట్ల స్పందిస్తూ... సినీ నటుల రాజకీయాల్లో రావాలనే ఆలోచనే తనకు నచ్చదని చెప్పారు. ఫిల్మ్ యాక్టర్లు నాయకులు కావడం దేశానికి పట్టిన దౌర్భాగ్యం అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. వాళ్లు నటులు, వారికి అభిమానులు ఉన్నారు. తమ బాధ్యతెంటో వారికి తెలిసి ఉండాలంటూ ప్రకాష్ రాజ్ తెలిపారు.
 

click me!