నాకు చాలా మందితో అక్రమ సంబంధాలుండేవి- రాజశేఖర్

Published : Nov 12, 2017, 01:14 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
నాకు చాలా మందితో అక్రమ సంబంధాలుండేవి- రాజశేఖర్

సారాంశం

చాలా ాకాలం తర్వాాత గరుడవేగ తో రాజశేఖర్ కు హిట్ మూవీ గరుడవేగ హిట్ తో మంచి జోష్ లో వున్న రాజశేఖర్ ఇంటర్వ్యూల్లో ఓపెన్ గా మాట్లాడుతూ  తానేమీ రామున్ని కాదంటున్న రాజశేఖర్

హీరో రాజశేఖర్ చాలా కాలం తర్వాత 'గరుడవేగ' సినిమాతో గొప్ప విజయాన్ని అందుకున్నారు. పదేళ్లపాటు సరైన హిట్‌లేక సతమతమైన రాజశేఖర్‌ ఈ విజయంతో జోష్ లో వున్నారు. ఇంతవరకు మౌనంగా ఉన్న ఆయన దాపరికం లేకుండా అన్నీ మాట్లాడుతున్నారు. గరుడవేగ సక్సెస్‌పై స్పందిస్తూ తల్లి మరణం తనను కుంగదీస్తే..ఈ సినిమా విజయం ధైర్యాన్నిచ్చిందని అన్నారు.

 

చాలా రోజుల కిందట తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన తారా చౌదరితో సంబంధాలున్నాయట కదా? అన్న ప్రశ్నకు ఆయన వివరణ ఇచ్చారు. తానేమీ రాముడ్ని కాదని, పెళ్లికి ముందు కొందరితో సంబంధాలున్నాయని తెలిపారు. అలాగే జీవితతో పెళ్లైన తర్వాత కూడా కొందరితో సంబంధాలు కొనసాగాయని నిజాయతీగా ఒప్పుకున్నారు. కానీ తారా చౌదరితో మాత్రం ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. తనతో ఆమె ఒకసారి ఫోటో దిగిందని.. అప్పుడే ఆమెను తొలిసారి చూశానని రాజశేఖర్ వ్యాఖ్యానించారు. ఆ తరువాత మరో సందర్భంలో ఆమె కలిసిందని.. అంతే తప్ప తమ మధ్య ఎలాంటి అఫైర్ లేదని ఆయన స్పష్టం చేశారు.



ఇటీవల ఆలీతో సరదాగా కార్యక్రమంలోనూ తన తొలిప్రేమ గురించి వెల్లడించారు. తనకంటే వయసులో ఐదేళ్ల పెద్దమ్మాయిని ప్రేమించినట్లు తెలిపారు. ముందు తను నా ప్రేమను అంగీకరించపోవడంతో దేవదాసులా మారానని, ఆ తర్వాత దేవుడి దయతో ఆమె ఒప్పుకుందని తెలియజేశారు. అలాగే జీవితను తొలిసారి ఓ సినిమాలో కధానాయికగా తీసుకోవద్దని అంటే, చివరకు ఆచిత్రంలో నన్నే హీరోగా తప్పించారని చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా