ప్రకాష్ రాజ్ కు ప్రధాని మీద కోపమొచ్చింది...

Published : Oct 02, 2017, 03:11 PM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
ప్రకాష్ రాజ్ కు ప్రధాని మీద కోపమొచ్చింది...

సారాంశం

గౌరీలంకేష్ హత్యకేసులో నిందితులను శిక్షించాలి బెంగళూరులో జరిగిన సదస్సులో ప్రధానిపై చురకలు నా లాంటి నటులను మించిన నటుడు మోదీ 

విలక్షణ నటుడిగా దక్షిణాదిలో క్రేజ్ వున్న స్టార్ ఆర్టిస్ట్ ప్రకాష్ రాజ్. దక్షిణాదిలోనే కాక... బాలీవుడ్ లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన నటుడు ప్రకాష్ రాజ్. ప్రధాని నరేంద్ర మోదీపై ప్రముఖ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ తనకంటే పెద్ద నటుడని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. జర్నలిస్ట్‌ గౌరి లంకేశ్‌ హత్యపై ప్రధాని మోదీ మౌనం వీడాలని డిమాండ్‌ చేశారు. అభిమానులకు ఒక నటుడు తనను పాలోకావాలని ఎలా చెప్తాడో అలాగే మోదీ మౌనం ఉందని పేర్కొన్నారు. దీన్నిబట్టే ఆయన తన కంటే పెద్ద నటుడన్న సంగతి అర్థమవుతోందని అన్నారు. వామపక్ష విద్యార్థి సంఘం డీవైఎఫ్‌ఐ 11వ రాష్ట్ర సమావేశంలో ఆదివారం ప్రకాశ్ రాజ్ ప్రారంభోపన్యాసం చేశారు.

 

‘గౌరి లంకేశ్‌ను హత్యచేసిన వారిని పట్టుకోవచ్చు, పట్టుకోలేకపోవచ్చు. కానీ సోషల్‌ మీడియాలో చాలా మంది సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. వారంతా ఎవరో, వారి సిద్ధాంతం ఏమిటో మనకు తెలుసు. వీరిలో కొంత మందిని నరేంద్ర మోదీ ఫాలో కావడం నన్ను కలవరపెడుతోంది. మోదీ మౌనం ఆందోళన కలిగిస్తోంది. తన మద్దతుదారులు చేసిన దారుణాన్ని సమర్థించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్టుగా కనబడుతోంద’ని ప్రకాశ్‌రాజ్‌ అన్నారు. ఇటువంటి దారుణాలపై ప్రధాని మోదీ మౌనం కొనసాగిస్తే తన ఐదు జాతీయ అవార్డులను తిరిగి ఇచ్చేందుకు వెనుకాడబోనని ఆయన ప్రకటించారు.

 

 గౌరి లంకేశ్‌ను బెంగళూరులోని తన నివాసంలోనే  సెప్టెంబర్‌ 5న ఇద్దరు దుండగులు కాల్చి చంపారు. గౌరి లంకేశ్‌ హత్యను ఖండిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు