పాకిస్తాన్ హీరోకి ప్రకాశ్ రాజ్ మద్దతు, మండిపడుతున్న నెటిజన్లు

ఎప్పటికప్పుడు  బీజేపీకి యాంటీ స్టెట్మెంట్స్ ఇస్తుంటారు స్టార్ నటుడు ప్రకాశ్ రాజ్.  ప్రకాశ్ రాజ్ సోషల్ మీడియా పోస్ట్ ల గురించి అందరికి తెలిసిందే. కాని ఒక్కోసారి ఆయన చేసే కామెంట్స్ వివాదాస్పదం అవ్వడంతో పాటు విమర్శలకు కూడా దారి తీస్తుంటుంది. ఈక్రమంలోనే ఈ స్టార్ నటుడు పాకిస్తాన్ హీరోకి మద్దతుగా నిలవడం సంచలనంగా మారింది. 
 

Prakash Raj Supports Pakistani Actor Amid Ban Faces Backlash from Netizens in telugu jms

ప్రస్తుతం దేశమంతా పాకిస్తాన్ పై కోపంగా ఉంది. ఎప్పుడెప్పుడు పాకిస్తాన్ కు మనవాళ్లు బుద్దిచెపుతారా అని అంతా ఎదురు చూస్తున్నారు. పహల్గాం దాడితో దేశం అంతా ఒక్కటై పాకిస్తాన్ కు బుద్ది చెప్పాల్సిందే అంటున్నారు. ఇప్పటికే పాకిస్తాన్ ను అన్ని రకాలుగా బాన్ చేసింది ఇండియా. ఎగుమతులు, దిగుమతులు ఆపేయడంతో పాటు, వారికి ఇండియాన నుంచి రావల్సిన నీటిని కూడా ఆపేసింది. అంతే కాదు పాకిస్తాన్ సోషల్ మీడియాను కూడా ఇండియాల బ్యాన్ చేశారు. ఆ దేశపు నటులను కూడా ఇక్కడ బ్యాన్ చేశారు. ఇండియాలో ఉన్న పాకిస్తానీయులువెంటనే దేశం వదిలి వెళ్లిపోవాలని ఇండియన్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. ఇక పాకిస్తాన్ ను అన్ని విధాలుగా బ్యాన్ చేస్తూ వచ్చింది ఇండియా. 

అయితే పాకీస్తాని నటుల సోషల్ మీడియాను బ్లాక్ చేయడం వరకూ బాగానే ఉంది కాని. పాక్ హీరోల సినిమాను బాలీవుడ్ లో రిలీజ్ అవ్వకుండా ఆపేయడంపై కొంత మంది వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇటువంటి విషయాలలో స్పందించడానికి ఎప్పుడూ ముందుకు వచ్చే ప్రకాశ్ రాజ్ పాక్ హీరో సినిమా రిలీజ్ ను అడ్డుకోవడంపై స్పందించారు. పాకిస్తాన్ నటుడు ఫవాద్ ఖాన్ హీరోగా నటించిన అబిర్ గులాల్ సినిమాను ఇండియాలో బ్యాన్ చేయడాన్ని ప్రకాశ్ రాజ్ తప్పు పట్టారు. 

Latest Videos

పోర్నోగ్రాఫీని తప్పించి ఏ సినిమాను ఇలా నిషేదించడం కరెక్ట్ కాదు అన్నారు ప్రకాశ్ రాజ్. పాక్ నటుల సినిమాలు చూస్తారా లేదా అనేది సినిమా రిలీజ్ తర్వాత ప్రజలు నిర్ణయించుకుంటారని, రిలీజ్ చేసి ఫలితాన్ని వారికే వదిలేయాలని ఆయన అన్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రకాశ్ రాజ్ ఈ వ్యాక్యలు చేశారు. పహల్గాం ఉగ్రదాడి తరువాత పాక్ నటులపై నిషేదంలో భాగంగా.. ఫవాద్, వాణీకపూర్ నటించిన సినిమాను కేంద్ర ప్రభుత్వం రిలీజ్ కు ముందే బ్యాన్ చేసింది. దాంతో ప్రకాశ్ రాజ్ ఈ విధంగా స్పందించారు.

 అయితే ప్రకాశ్ రాజ్ స్పందనపై విమర్శలు వస్తున్నాయి. చాలామంది నెటిజన్లు ప్రకాశ్ రాజ్ ను విమర్శిస్తుండగా.. కొంత మంది సపోర్ట్ చేస్తున్నారు. ఇక పహల్గాం దాడి తరువాత  ఆచర్యను ఖండిస్తూ..సుధీర్ఘమైన నోట్ ను రిలీజ్ చేశారు ప్రకాశ్ రాజ్. ఇటువంటి పనులు మా దేశం చేయదు, దేశ పౌరులు అంతకన్నాచేయరు. మా మంచి తనాన్ని చేతగాని తనంగా భావించవద్దు అంటూ పాకిస్తాన్ ను విమర్శిస్తూ.. ఆయన పోస్ట్ చేశారు. 

vuukle one pixel image
click me!