హరిహర వీరమల్లు నుంచి మైండ్ బ్లోయింగ్ అప్డేట్.. ట్రైలర్ విస్ఫోటనం త్వరలోనే..

Published : May 04, 2025, 08:50 PM IST
హరిహర వీరమల్లు నుంచి మైండ్ బ్లోయింగ్ అప్డేట్.. ట్రైలర్ విస్ఫోటనం త్వరలోనే..

సారాంశం

పవన్ కళ్యాణ్ నేడు ఆదివారం రోజు హరిహర వీరమల్లు షూటింగ్ లో జాయిన్ అయినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. రెండు రోజుల పాటు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు షూటింగ్లో పాల్గొంటారు.

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా కాలంగా రాజకీయాలకు పరిమితమయ్యారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ బిజీగా ఉన్నారు. దీనితో తన చిత్రాల షూటింగ్స్ కి డేట్లు కేటాయించే సమయం కూడా పవన్ కి దొరకడం లేదు. ఫలితంగా హరిహర వీరమల్లు, ఓజి చిత్రాలు చాలా కాలంగా వాయిదా పడుతూనే ఉన్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ పరిస్థితి ఏంటో తెలియడం లేదు. 

హరిహర వీరమల్లు షూటింగ్ ఇంకాస్త మాత్రమే మిగిలి ఉంది. అది పూర్తయితే రిలీజ్ కి రెడీ అయినట్లే. తాజాగా హరిహర వీరమల్లు చిత్ర యూనిట్ ఫ్యాన్స్ కి మైండ్ బ్లోయింగ్ అప్డేట్ అందించారు. 

పవన్ కళ్యాణ్ నేడు ఆదివారం రోజు హరిహర వీరమల్లు షూటింగ్ లో జాయిన్ అయినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. రెండు రోజుల పాటు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు షూటింగ్లో పాల్గొంటారు. అంతటితో హరిహర వీరమల్లు షూటింగ్ కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత హరిహర వీరమల్లు పాటలు, ప్రమోషన్ కార్యక్రమాలు రెడీ అవుతాయని చిత్ర యూనిట్ ప్రకటించారు. అంతేకాదు త్వరలోనే హరిహర వీరమల్లు ట్రైలర్ విస్ఫోటనం ఉంటుందని తెలిపారు. చిత్ర యూనిట్ చేసిన ప్రకటనతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి గా ఉన్నారు.


ఏళ్ల తరబడి వాయిదా పడుతూ వస్తున్న హరిహర వీరమల్లు చిత్రానికి ఎట్టకేలకు మోక్షం లభిస్తుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు పవన్ కళ్యాణ్ ని వీరమల్లు గెటప్ లో చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ తన కెరీర్ లోనే తొలిసారి నటిస్తున్న పీరియాడిక్ చిత్రం ఇదే. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. కీరవాణి సంగీతం అందించారు.ఈ చిత్రంలో ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ నటిస్తున్నారు. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: అలాంటి వాళ్ళు కప్ గెలిచినట్లు చరిత్రలో లేదు, ఈసారి బిగ్ బాస్ టైటిల్ ఎవరిదంటే ?
Kartik Aaryan: చెల్లి పెళ్లి వేడుకలో హంగామా చేసిన యంగ్ హీరో, సందడి మొత్తం అతడిదే.. వైరల్ ఫోటోస్