సుడిగాలి సుధీర్, అనసూయకి బాగా తెలుసు, ప్రకాష్ రాజ్ ఒక రేంజ్ లో.. అసలు ప్లాన్ ఇదే

pratap reddy   | Asianet News
Published : Sep 04, 2021, 03:21 PM IST
సుడిగాలి సుధీర్, అనసూయకి బాగా తెలుసు, ప్రకాష్ రాజ్ ఒక రేంజ్ లో.. అసలు ప్లాన్ ఇదే

సారాంశం

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాడు. ప్రకాష్ రాజ్, విష్ణు మధ్య ప్రధాన పోటీ ఉంటుంది అంతా భావిస్తున్నారు. ఈ తరుణంలో ప్రకాష్ రాజ్ తన బలాన్ని మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాడు. ప్రకాష్ రాజ్, విష్ణు మధ్య ప్రధాన పోటీ ఉంటుంది అంతా భావిస్తున్నారు. ఈ తరుణంలో ప్రకాష్ రాజ్ తన బలాన్ని మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు మా అధ్యక్ష బరిలో ఉన్న జీవిత రాజశేఖర్, నటి హేమ కూడా తమ పోటీని విరమించుకుని ప్రకాష్ రాజ్ ప్యానల్లో చేరిపోయారు. 

దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు.. ప్రకాష్ రాజ్ ఎలాంటి స్ట్రాటజిలతో ముందుకు వెళుతున్నారో అని. గతంలోనే ప్రకాష్ రాజ్ తన ప్యానల్ సభ్యులని ప్రకటించారు. ఈసారి సభ్యులని మరోసారి ప్రకటించిన ప్రకాష్ రాజ్ వారి పదవుల్ని కూడా ప్రస్తావించారు. 

ప్రకాష్ రాజ్ ప్యానల్ లో సుడిగాలి సుధీర్, యాంకర్ అనసూయ లాంటి యువతని ఆకర్షించే సెలెబ్రిటీలు ఉన్నారు. అయితే వీరిని ఎందుకు తన ప్యానల్ లో ఎంపిక చేసుకున్నారో కూడా ప్రకాష్ రాజ్ వివరించారు. అనసూయ అద్భుతమైన యాంకర్. ఆమెకు బుల్లితెరపై అన్ని సమస్యలు తెలుసు. ఎవరితో అయినా కలసిపోయి మాట్లాడగలిగే నైపుణ్యం ఉంది. అనసూయ లాంటి వారు ప్యానల్ లో అవసరం అని ప్రకాష్ రాజ్ ప్రశంసలు కురిపించారు. 

ఇక సుడిగాలి సుధీర్ బుల్లితెరపై యూత్ ఐకాన్ అని ప్రకాష్ రాజ్ అభివర్ణించాడు. అలాంటి యువకులతో కలసి పనిచేస్తే మాకు కూడా కొత్త ఐడియాలు వస్తాయి అంటూ ప్రకాష్ రాజ్ తెలిపారు. సుధీర్, అనసూయపై ప్రకాష్ రాజ్ ఇలా ప్రశంసలు కురిపించడం వైరల్ గా మారింది. ఇక తన ప్యానల్ కొత్తవారికి, యువత, మహిళలు, బుల్లితెర ఇలా అందరికి సమానంగా అవకాశాలు వచ్చేలా డిజైన్ చేసినట్లు తెలిపారు. 

ప్రకాష్ రాజ్ ప్యానల్ మెంబర్స్ వీళ్ళే.. ప్రకాశ్‌రాజ్‌ (అధ్యక్షుడు), నాగినీడు (ట్రెజరర్‌), బెనర్జీ, హేమ (ఉపాధ్యక్షులు), శ్రీకాంత్‌ (ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌), జీవితా రాజశేఖర్‌ (జనరల్‌ సెక్రటరీ), అనితా చౌదరి, ఉత్తేజ్‌ (జాయింట్‌ సెక్రటరీ). ఎగ్జిక్యూటివ్‌ సభ్యులుగా అనసూయ, అజయ్, బి.భూపాల్, బ్రహ్మాజీ, ప్రభాకర్, గోవిందరావు, ఖయ్యూమ్, కౌశిక్, ప్రగతి, రమణారెడ్డి, శివారెడ్డి, సమీర్, సుడిగాలి సుధీర్, డి.సుబ్బరాజు, సురేశ్‌ కొండేటి, తనీశ్, టార్జాన్‌ ఉన్నారు.

PREV
click me!

Recommended Stories

Dragon Glimpse: ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ ఊచకోత.. 4 నిమిషాలు అల్లాడించిన తారక్..
Darshan Thoogudeepa: ప్రపంచమంతా ఎదురొచ్చినా నిన్ను వదలను.. దర్శన్‌పై ఆయన భార్య ఎమోషనల్ పోస్ట్