పవన్‌ కళ్యాణ్‌ దాతృత్వం.. `భీమ్లా నాయక్‌` ఇంట్రో సింగర్‌ మొగులయ్యకి ఆర్థిక సాయం

Published : Sep 04, 2021, 02:38 PM IST
పవన్‌ కళ్యాణ్‌ దాతృత్వం.. `భీమ్లా నాయక్‌` ఇంట్రో సింగర్‌ మొగులయ్యకి ఆర్థిక సాయం

సారాంశం

తన `భీమ్లా నాయక్‌` చిత్రంలో టైటిల్‌ సాంగ్‌ పాడి ఆకట్టుకున్న కిన్నెర కళాకారుడు మొగులయ్యకి ఆర్థిక సాయాన్ని అందించారు పవన్‌. `భీమ్లా నాయక్‌`ని పరిచయం చేసే గీతానికి సాకీ ఆలపిస్తూ కిన్నెర మెట్లపై స్వరాన్ని పలికించిన దర్శనం మొగులయ్యకి ఆర్థిక సాయాన్ని అందిస్తున్నట్టు పేర్కొన్నారు.

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. కళాకారులను ప్రోత్సహించడంతో ఆయన ఎప్పుడూ ముందే ఉంటారు. ఈ నేపథ్యంలో తాజాగా తన `భీమ్లా నాయక్‌` చిత్రంలో టైటిల్‌ సాంగ్‌ పాడి ఆకట్టుకున్న కిన్నెర కళాకారుడు మొగులయ్యకి ఆర్థిక సాయాన్ని అందించారు. `భీమ్లా నాయక్‌`ని పరిచయం చేసే గీతానికి సాకీ ఆలపిస్తూ కిన్నెర మెట్లపై స్వరాన్ని పలికించిన దర్శనం మొగులయ్యకి రూ.2లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నట్టు పవన్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఓ నోట్‌ని విడుదల చేశారు. 

`తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతానికి చెందిన మొగులయ్య 12 మెట్ల కిన్నెరపై స్వరాలు పలికిస్తూ గానం చేసే అరుదైన కళాకారుడు. వర్తమాన సమాజంలో కనుమరుగవుతున్న ఇలాంటి కళలు, ముఖ్యంగా జానపద కళారూపాలను యువతకు పరిచయం చేయాలనే తపనతో పవన్ కల్యాణ్ తన బీమ్లా నాయక్ చిత్రం ద్వారా తెరపైకి తీసుకువచ్చారు. మొగులయ్య కిన్నెర మీటుతూ పలు జానపద కథలను పాటల రూపంలో వినిపిస్తారు. 

ఆయనకు `పవన్ కల్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సిలెన్స్` ద్వారా రూ.2 లక్షలు అందించాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ఈ మేరకు ఆ మొత్తాన్ని అందించాలని కార్యాలయ సిబ్బందికి సూచించారు పవన్ కళ్యాణ్. త్వరలోనే ఇందుకు సంబంధించిన చెక్కును మొగులయ్యకు అందచేయనున్నారు` అని జనసేన పార్టీ అధ్యక్షులకు రాజకీయ కార్యదర్శి  పి. హరి ప్రసాద్‌ పేర్కొన్నారు. సాగర్‌ కె చంద్ర దర్శకత్వంలో పవన్‌ కళ్యాణ్‌ `భీమ్లా నాయక్‌` చిత్రంలో నటిస్తున్నారు. రానా మరో హీరో. త్రివిక్రమ్‌ మాటలు, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. 

ఇందులో పవన్‌ సరసన నిత్యా మీనన్‌, రానా సరసన ఐశ్వర్యా రాజేష్‌ నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇటీవల పవన్‌ కళ్యాణ్‌ బర్త్ డే సందర్భంగా `భీమ్లా నాయక్‌` చిత్ర టైటిల్‌ సాంగ్‌ని విడుదల చేసిన విషయం తెలిసిందే. పాట జానపద ఇంట్రోని మొగులయ్య ఆలపించారు. అంతేకాదు పాటలోనూ ఆయన కనిపించడం విశేషం. ఆయన పాడిన ఇంట్రోకి మంచి స్పందన లభిస్తుంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Suman Shetty Remuneration: బిగ్‌ బాస్‌ విన్నర్‌ ప్రైజ్‌ మనీని మించి పారితోషికం.. సుమన్‌ శెట్టికి దక్కింది ఎంతంటే?
ప్రభాస్‌కి గ్యాప్‌ లేకుండా చేసిన చిరంజీవి.. `మన శంకరవరప్రసాద్‌ గారు` రిలీజ్‌ డేట్‌ ఫిక్స్