గురువు పవన్ కంటే ముందు శిష్యుడు నితిన్ తో?

Published : Sep 04, 2021, 02:17 PM IST
గురువు పవన్ కంటే ముందు శిష్యుడు నితిన్ తో?

సారాంశం

పవన్ చిత్రం 2022 సెకండ్ హాఫ్ లో సెట్స్ పైకి వెళ్లనుంది. కాగా ఈ గ్యాప్ లో సురేందర్ రెడ్డి నితిన్ కోసం ఓ కథ సిద్ధం చేశారట. రచయిత వక్కంతం వంశీతో కలిసి స్క్రిప్ట్ సిద్ధం చేయగా, నితిన్ కి ఆ స్టోరీ లైన్ కూడా నచ్చిందట.

కిక్, రేసు గుర్రం, సైరా వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో స్టార్ దర్శకుల జాబితాలో చేరారు సురేందర్ రెడ్డి. ఇక పవన్ కళ్యాణ్ తో మూవీ చేసే అవకాశం దక్కించుకున్న ఈ యాక్షన్ చిత్రాల హీరో, ఆ మూవీని ఓ రేంజ్ లో తెరకెక్కించనున్నారని సమాచారం. సురేందర్ రెడ్డి-పవన్ చిత్రానికి స్టార్ రైటర్ వక్కంతం వంశీ కథను సమకూర్చారు. మరోవైపు సురేందర్ రెడ్డి అక్కినేని అఖిల్ తో చేస్తున్న ఏజెంట్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

హైదరాబాద్ లో  ఏజెంట్ మూవీ చిత్రీకరణ జరుగుతుండగా, ఈ ఏడాది చివరి కల్లా షూటింగ్ పూర్తి కానుందట. ఇక పవన్ చిత్రం 2022 సెకండ్ హాఫ్ లో సెట్స్ పైకి వెళ్లనుంది. కాగా ఈ గ్యాప్ లో సురేందర్ రెడ్డి నితిన్ కోసం ఓ కథ సిద్ధం చేశారట. రచయిత వక్కంతం వంశీతో కలిసి స్క్రిప్ట్ సిద్ధం చేయగా, నితిన్ కి ఆ స్టోరీ లైన్ కూడా నచ్చిందట. ఈ ప్రాజెక్ట్ కి నితిన్ పచ్చ జెండా ఊపగా, పవన్ మూవీ మొదలయ్యే లోపు నితిన్ తో చకచకా ఈ మూవీ పూర్తి చేయనున్నాడట. 


దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కలదని అంటున్నారు. సైరా తరువాత సురేందర్ రెడ్డి స్టార్ హీరోల కోసం ప్రయత్నాలు చేసి విసిగిపోయారు. స్టార్స్ ఎవరూ ఖాళీగా లేకపోవడంతో అఖిల్ తో మూవీ చేస్తున్నారు. పవన్ తో మూవీ ఓకే అయినా, అది సెట్స్ పైకి వెళ్ళడానికి చాలా సమయం ఉన్న తరుణంలో ఇలా టూ టైర్ హీరోలతో మూవీలు చేసే ప్లాన్స్ చేస్తున్నట్లు తెలుస్తుంది. 

PREV
click me!

Recommended Stories

ప్రభాస్ అభిమానుల మధ్య నలిగిపోయిన నిధి అగర్వాల్, రాజాసాబ్ ఈవెంట్ లో స్టార్ హీరోయిన్ కు చేదు అనుభవం..
Gunde Ninda Gudi Gantalu Today: ‘ఇతను ఎవరో నాకు తెలీదు’ మౌనిక మాటకు పగిలిన బాలు గుండె, మరో షాకిచ్చిన శ్రుతి