మా ఎన్నికల్లో ఈసారి ఎక్కువ ఓటింగ్ జరుగుతుందని ఆకాంక్షించారు ప్రకాశ్ రాజ్ (prakash raj). మా అధ్యక్ష (maa elections) బరిలో నిలిచిన ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. పోస్టల్ బ్యాలెట్లపై (postal ballot) ఎన్నికల అధికారి కూడా తప్పుడు స్టేట్‌మెంట్లు ఇస్తున్నారని ఆరోపించారు
మా ఎన్నికల్లో ఈసారి ఎక్కువ ఓటింగ్ జరుగుతుందని ఆకాంక్షించారు ప్రకాశ్ రాజ్ (prakash raj). మా అధ్యక్ష (maa elections) బరిలో నిలిచిన ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. పోస్టల్ బ్యాలెట్లపై (postal ballot) ఎన్నికల అధికారి కూడా తప్పుడు స్టేట్‌మెంట్లు ఇస్తున్నారని ఆరోపించారు. పోస్టల్ బ్యాలెట్‌పై తప్పు జరిగిపోయిందని ఆయన ఆన్నారు. దేశంలో న్యాయం లేకుండా పోయిందని.. మంచివాళ్లు పోటీ చేయలేకపోతున్నారని ప్రకాశ్ రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు.
అంతకుముందు `మా` ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌పై (krishna mohan) నాగబాబు (nagababu)తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. మోహన్‌బాబుకి (manchu mohan), మంచు విష్ణుకి (manchu vishnu) ఫేవర్ గా ఉన్నాడని ఆరోపించారు. అంతేకాదు మోహన్‌బాబు ఫ్యామిలీకి, కృష్ణమోహన్‌కి మధ్య రిలేషన్ ఉందని తెలిసిందని, అందుకే ఫేవర్‌గా చేస్తున్నాడని, అతనిపై తమకి నమ్మకం లేదన్నారు. ఈ సందర్భంగా మరొక ఎన్నికల అధికారి కావాలని ఆయన కోరుతున్నామని తెలిపారు. గతంలో పనిచేసిన ఎన్నికల అధికారి నారాయణరావుపై కూడా తమకి నమ్మకం లేదన్నారు.
undefined
ALso Read:`మా` ఎన్నికల అధికారి మోహన్‌బాబు రిలేటివ్..నాగబాబు సంచలన ఆరోపణలు.. నరేష్ చెత్త అధ్యక్షుడంటూ కామెంట్
ప్రకాష్‌రాజ్‌కి మెగా ఫ్యామిలీ సపోర్ట్ పై ఆయన స్పందిస్తూ, `మొదటగా ప్రకాష్‌రాజ్ అన్నయ్యని సంప్రదించి తాను `మా` అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నానని చెప్పినప్పుడు, `మా` కోసం ఆయన చేయబోతున్న కార్యక్రమాలు విని నమ్మకం కలిగింది. ఆ కార్యక్రమాలు చేయగలననే మాట తీసుకుని ఆయనకు మద్దతు ఇచ్చాం. అన్నయ్య ఒక్కసారి ఒకరికి మాటిస్తే దాన్ని వెనక్కి తీసుకోరని తెలిపారు. ఒకరికి మాటిచ్చాక నేను పోటీ చేసినా నాకు మద్దతివ్వడు` అని తెలిపారు.
అదే సమయంలో మోహన్‌బాబుతో మాట్లాడినప్పుడు కూడా అదే విషయాన్ని స్పష్టం చేశారు. ప్రకాష్‌కి తమ మద్దతు ఉంటుందని అన్నయ్య స్పష్టం చేశారని తెలిపారు నాగబాబు. `మా` కోసం ప్రకాష్‌రాజ్ పర్‌ఫెక్ట్ కార్యాచరణతో ముందుకెళ్తున్నారు. ముప్పై కోట్లతో భారీగా `మా` భవనం నిర్మించబోతున్నాడని చెప్పాడు.