'పెళ్లి సందD' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఇద్దరు అగ్ర హీరోలు

pratap reddy   | Asianet News
Published : Oct 09, 2021, 05:53 PM IST
'పెళ్లి సందD' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఇద్దరు అగ్ర హీరోలు

సారాంశం

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కుతున్న చిత్రం పెళ్లి సందD. గౌరీ రోనంకి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తున్నాడు.

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కుతున్న చిత్రం పెళ్లి సందD. గౌరీ రోనంకి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తున్నాడు. రోషన్ కి జోడిగా యంగ్ బ్యూటీ శ్రీలీల నటిస్తోంది. ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మంచి బజ్ నెలకొని ఉంది. 

ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అక్టోబర్ 15న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. దీనితో ప్రచార కార్యక్రమాలు షురూ అయ్యాయి. అక్టోబర్ 10న ఈచిత్ర ప్రీరిలీజ్ వేడుక జెఆర్సీ కన్వెన్షన్ హాల్ లో ఘనంగా జరగనుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పెద్ద ప్లానే వేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్టులుగా మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ హాజరు కాబోతున్నారు. 

Also Read: టాప్ లెస్ గా శృతి హాసన్.. ఘోస్ట్ గా మారి అరాచకం

దీనితో పెళ్లి సందడి ప్రీ రిలీజ్ వేడుకకు కొత్త కళ సంతరించుకోనుంది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి, వెంకటేష్ ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించారు. ఈ ఇద్దరు హీరోలకు శ్రీకాంత్ అంటే ఇష్టం. దీనితో శ్రీకాంత్ తనయుడి కోసం చిరు, వెంకీ వేదిక పంచుకోనున్నారు. 

రాఘవేంద్ర రావు సినిమా అంటే కలర్ ఫుల్ గా భారీ తారాగణంతో ఉంటుంది. ఈ చిత్రం కూడా అలాగే ఉండబోతోంది. ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్, రావు రమేష్, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణ మురళి, రాజీవ్ కనకాల, హేమ, ప్రగతి ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్స్ మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీరవాణి అందించిన సంగీతానికి మంచి స్పందన వస్తోంది. 

 

PREV
click me!

Recommended Stories

Karan Johar: ఆలియా, షారుఖ్ ఖాన్ లని అన్ ఫాలో చేసిన కరణ్ జోహార్.. ఇద్దరితో గొడవలా ?
Ram Charan Peddi: పెద్ది ఎవరి కోసం చూడాలి ? అసలెందుకు చూడాలి ?.. 5 కారణాలు ఇవే