బాలయ్య భామ ప్రగ్యా జైశ్వాల్‌కి కరోనా.. టెన్షన్‌లో `అఖండ` టీమ్‌

Published : Oct 10, 2021, 05:56 PM IST
బాలయ్య భామ ప్రగ్యా జైశ్వాల్‌కి కరోనా.. టెన్షన్‌లో `అఖండ` టీమ్‌

సారాంశం

చాలా రోజుల తర్వాత సినీ సెలబ్రిటీలకు కరోనా వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో హల్‌చల్‌ చేస్తుంది. బాలయ్య భామ ప్రగ్యా జైశ్వాల్‌కి తాజాగా కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఆమె స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.

కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతుంది. సినిమా షూటింగ్‌లు శరవేగంగా జరుగుతున్నాయి. సినిమాలు విడుదలవుతున్నాయి. మళ్లీ చిత్ర పరిశ్రమలో పూర్వ వైభవం ప్రారంభమైంది. ఈ క్రమంలో బాలయ్య భామ ప్రగ్యాజైశ్వాల్‌ కరోనా బారిన పడింది. తాజాగా ఆమె తనకు కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు తెలిపింది. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా pragya jaiswal ఓ పోస్ట్ పేర్కొంది. 

`ఆదివారం నేను కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యాను. నాకు స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నాయి. ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్నా. ఇంతకు ముందు ఓసారి కరోనా బారిన పడ్డాను. ఇప్పుడు మళ్లీ కరోనా వచ్చింది. ప్రస్తుతం నేను ఐసోలేషన్లో ఉన్నాను. గత పది రోజులుగా నన్ను కలిసిన వారంతా జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి` అని తెలిపింది. 

also read : MAA Elections: శివ బాలాజీ చేయి కొరికేసిన హేమ..

ఇదిలా ఉంటే ప్రగ్యా జైశ్వాల్‌కి కరోనా సోకిందనే వార్తతో balakrishnaలో గుబులు స్టార్ట్ అయ్యింది. ఆయన హీరోగా నటిస్తున్న akhanda చిత్ర యూనిట్‌లో టెన్షన్‌ మొదలైంది. ఆమె ఇటీవల చిత్ర యూనిట్‌తో కలిసి కనిపించారు. చిత్రీకరణ వ్రాప్‌ అప్‌ పార్టీలోనూ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో యూనిట్‌కి కరోనా సోకి ఉంటుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో `అఖండ` యూనిట్‌ హోం క్వారంటైన్‌ కాబోతుందని సమాచారం. 

ఇదిలా ఉంటే బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న `అఖండ` చిత్రంలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైశ్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. మిర్యాల రవీందర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతుంది. ఇటీవల చిత్రీకరణ పూర్తయిన సందర్భంగా, అలాగే వ్రాప్‌ అప్‌ పార్టీలో బాలకృష్ణతో కలిసి ప్రగ్యాజైశ్వాల్‌ దిగిన ఫోటోని పంచుకున్న విషయం తెలిసిందే. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు
Remuneration: సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న ఒకే ఒక్కడు.. ఆయన ముందు ప్రభాస్, విజయ్‌, అల్లు అర్జున్‌ జుజూబీ