రూ. 750 కోట్ల బడ్జెట్.. దిమ్మతిరిగేలా చేయబోతున్న క్రేజీ డైరెక్టర్, టైటిల్ ఫిక్స్

By telugu teamFirst Published Oct 10, 2021, 3:45 PM IST
Highlights

హాలీవుడ్ దర్శకుడు క్రిస్టఫర్ నోలెన్ చిత్రాలకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. నోలెన్ చిత్రాలు పూర్తి వైవిధ్యంగా ఉంటాయి. ప్రేక్షకుల మెదడుకు పదును పెడుతూనే..  అద్భుతమైన విజువల్స్ తో ఒక కొత్త లోకంలోకి తీసుకువెళతాయి.

హాలీవుడ్ దర్శకుడు క్రిస్టఫర్ నోలెన్ చిత్రాలకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. నోలెన్ చిత్రాలు పూర్తి వైవిధ్యంగా ఉంటాయి. ప్రేక్షకుల మెదడుకు పదును పెడుతూనే..  అద్భుతమైన విజువల్స్ తో ఒక కొత్త లోకంలోకి తీసుకువెళతాయి. నోలెన్ గత ఏడాది తెరకెక్కించిన 'టెనెట్' చిత్రం అందరిని ఆకట్టుకుంది. ప్రస్తుతం నోలెన్ మరో కొత్త చిత్రానికి రెడీ అవుతున్నారు. 

నోలెన్ తన ప్రతి చిత్రం కోసం సాహసోపేతమైన కథాంశాలని ఎంచుకుంటారు. Christopher Nolan ఇప్పుడు తెరకెక్కించబోయే చిత్రం వరల్డ్ వార్ 2 బ్యాక్ డ్రాప్ లో అణుబాంబు తయారీ గురించి ఉండబోతోంది. అణుబాంబు పితామహుడిగా పేరుగాంచిన అమెరికా శాస్త్రవేత్త రాబర్ట్ ఓపెన్‌హీమర్ జీవితాన్ని నోలెన్ ఈ చిత్రంలో టచ్ చేయబోతున్నారట. 

Also Read: అఫీషియల్ : బాలీవుడ్ నటుడితో ప్రేమలో రకుల్ ప్రీత్ సింగ్

నోలెన్ ఏదైనా కథాంశం ఎంచుకుంటే పూర్తిగా అధ్యయనం చేసి స్క్రిప్ట్ మొదలు పెడతారు. ఈ చిత్రం కోసం కూడా నోలెన్.. ఓపెన్‌హీమర్ జీవితాన్ని, అణుబాంబు తయారీని పూర్తిగా అధ్యయనం చేశారట. తాజాగా ఈ చిత్రానికి టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. 'ఓపెన్‌హీమర్' అనే టైటిల్ నే ఖరారు చేశారు. 

ప్రముఖ నటుడు సిలియన్ మర్ఫీ టైటిల్ రోల్ లో ప్రధాన పాత్రలో నటించబోతున్నాడు. నోలెన్ తెరకెక్కించిన ఇన్సెప్షన్, బ్యాట్ మ్యాన్ బిగిన్స్, డంకిర్క్ లాంటి చిత్రాల్లో మర్ఫీ నటించారు. యూనివర్సల్ పిక్చర్స్ సంస్థ నిర్మాణంలో తెరకెక్కే ఈ చిత్రానికి 100 మిలియన్ డాలర్ల (దాదాపు రూ 750 కోట్లు) బడ్జెట్ అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. వరల్డ్ వార్ 2 పరిస్థితుల్లో అణుబాంబు తయారీ, పర్యవసానాలని నోలెన్ కళ్ళకు కట్టినట్లు చూపించబోతున్నారు త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది.  

click me!