MAA Elections: రాజకీయ లబ్ధి కోసం అలా చేస్తున్నారు.. పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు

Published : Oct 10, 2021, 04:45 PM IST
MAA Elections: రాజకీయ లబ్ధి కోసం అలా చేస్తున్నారు.. పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు

సారాంశం

గత కొన్ని వారాలుగా మీడియాలో, టాలీవుడ్ లో హంగామా చేసిన మా ఎన్నికలు ముగిశాయి. ఇక ఓట్ల లెక్కింపు, విజేత ప్రకటన మాత్రమే మిగిలి ఉంది.

గత కొన్ని వారాలుగా మీడియాలో, టాలీవుడ్ లో హంగామా చేసిన మా ఎన్నికలు ముగిశాయి. ఇక ఓట్ల లెక్కింపు, విజేత ప్రకటన మాత్రమే మిగిలి ఉంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగింది. రికార్డు స్థాయిలో 62 శాతం ఓటింగ్ నమోదైంది. 

మొత్తం 665 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. గత ఎన్నికల్లో 474 ఓట్లు మాత్రమే పోల్ అయ్యాయి. ఈసారి మా ఎన్నిక అత్యంత ఉత్కంఠ భరితంగా సాగింది. అటు ప్రకాష్ రాజ్ ప్యానల్,ఇటు మంచు విష్ణు ప్యానల్ ఇరు వర్గాలు పోలింగ్ ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 

కొందరు అగ్ర తారలు మినహా మిగిలిన వారంతా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇదిలా ఉండగా తన ట్వీట్స్ తో కన్ఫ్యూజన్ తో పాటు కొంత గందరగోళం సృష్టించే Poonam Kaur కూడా ఓటు హక్కు వినియోగించుకుంది. ఈ సందర్భంగా పూనమ్ కౌర్ మీడియా ముందు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. 

Also Read: MAA Elections: ముంబై నుంచి ఓటు వేయడానికి వచ్చిన జెనీలియా.. ప్రకాష్ రాజ్ కి షాక్

రాజకీయ లబ్ది కోసం కొందరు ఆర్టిస్టులని సతాయిస్తున్నారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఆర్టిస్టులని సతాయించడం మానుకోవాలని సూచించింది. రాజకీయాలు, మా అసోసియేషన్ ని మిక్స్ చేయకూడదని కోరింది. ఏ ప్యానల్ గెలిచినా రాజకీయాలకు అతీతంగా ఉండాలని సూచించింది. 

 

PREV
click me!

Recommended Stories

The Red Bag Movie Review: ది రెడ్ బ్యాగ్ మూవీ రివ్యూ, మహిళా నేపథ్యంలో సాగే క్రైమ్‌ థ్రిల్లర్‌ ఎలా ఉందంటే?
Indian Top 10 Heroes: దుమ్ములేపిన అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌ కి మహేష్‌ షాక్‌.. ఇండియా టాప్‌ హీరో ఎవరంటే?