Prabhas: ఆదిపురుష్ షూటింగ్ అప్డేట్... గుమ్మడికాయ కొట్టిన ప్రభాస్!

Published : Nov 11, 2021, 02:40 PM IST
Prabhas: ఆదిపురుష్ షూటింగ్ అప్డేట్... గుమ్మడికాయ కొట్టిన ప్రభాస్!

సారాంశం

వరుసగా భారీ ప్రాజెక్ట్స్ ప్రకటించిన హీరో ప్రభాస్... వాటిని అదే స్పీడ్ తో పూర్తి చేస్తున్నారు. ఆయన మొదటి మైథలాజికల్ చిత్రం ఆదిపురుష్ కి నేడు గుమ్మడికాయ కొట్టేశారు.   

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) రాధే శ్యామ్ అనంతరం నాలుగు చిత్రాలు ప్రకటించగా... వాటిలో ఆదిపురుష్ ఒకటి. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఆదిపురుష్ మైథలాజికల్ చిత్రంగా తెరకెక్కింది. కెరీర్ లో మొదటిసారి ప్రభాస్ రాముడు పాత్రలో కనిపించనుండడం విశేషం. ఈ మూవీ షూటింగ్ నేడు పూర్తి చేశారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఆదిపురుష్ షూటింగ్ పూర్తి అయిన సందర్భంలో యూనిట్ సభ్యులు సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సెలెబ్రేషన్స్ లో ప్రభాస్, హీరోయిన్ కృతి సనన్ (Kriti sanon), రావణాసురుడు పాత్ర చేస్తున్న సైఫ్ అలీఖాన్ తో పాటు, దర్శకుడు ఓం రౌత్ పాల్గొన్నారు. 

గత ఏడాది ఆదిపురుష్ (Adipursh) షూట్ మొదలు కాగా, చాలా త్వరగా దర్శకుడు ముగించారు. దాదాపు సెట్స్ లో ఈ మూవీ షూటింగ్ జరిగింది. గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ ప్రధానంగా సాగే మూవీ కావడంతో షూటింగ్ పార్ట్ త్వరిత గతిన ముగిసింది. 

Also read Trolling: 90 ఏసినట్టున్నాడు.. బాలీవుడ్‌ యాక్టర్‌ని ఓ రేంజ్‌లో ఆడుకుంటున్న ప్రభాస్‌ ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే?
ఇక 2022 ఆగష్టు 11న పాన్ ఇండియా మూవీగా ఆదిపురుష్ భారీ ఎత్తున విడుదల కానుంది. అప్పటి వరకు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి మూవీ విడుదల చేయనున్నారు. మరోవైపు రాధే శ్యామ్ (Radhe shyam) షూటింగ్ పూర్తి చేసిన ప్రభాస్... సలార్ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకుడిగా ఉన్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా కెజిఎఫ్ మేకర్స్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. 

Also read Anushka shetty: ప్రభాస్ హోమ్ బ్యానర్ లో అనుష్క న్యూ ఏజ్ ఎంటర్టైనర్
అనంతరం ప్రభాస్ దర్శకుడు నాగ్ అశ్విన్ తో ప్రకటించిన ప్రాజెక్ట్ కె చిత్రీకరణ పూర్తి చేయాల్సి ఉంది. ఈ మూవీ సైతం అత్యంత భారీ బడ్జెట్ తో  తెరకెక్కుతుంది. అలాగే అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తో స్పిరిట్ టైటిల్ తో ప్రభాస్ ఓ మూవీని ప్రకటించిన విషయం తెలిసిందే. స్పిరిట్ (Spirit) అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Duvvada Srinivas: చీరలమ్మి 7 నెలల్లో 12 కోట్లు సంపాదించా, సక్సెస్ అంటే ఇది
Ramya Krishnan రహస్యం వెల్లడించిన రజినీకాంత్, నీలాంబరి పాత్ర రిజెక్ట్ చేసిన స్టార్ ఎవరో తెలుసా?