అఫీషియల్: ‘ఖిలాడి’ రిలీజ్ డేట్ ఫిక్స్

Published : Nov 11, 2021, 02:16 PM IST
అఫీషియల్: ‘ఖిలాడి’ రిలీజ్ డేట్ ఫిక్స్

సారాంశం

వేస‌విలో విడుద‌ల కావాల్సిన ఈ సినిమా వాయిదా ప‌డతూ వచ్చింది. దీంతో ఖిలాడి విడుద‌ల ఎప్పుడుంటుందా? అని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న ర‌వితేజ అభిమానుల‌కు మేక‌ర్స్ రిలీజ్  న్యూస్ చెప్పేశారు. 

మాస్ మహారాజ రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కలయికలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఖిలాడి’. కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘ఖిలాడి’ నుంచి ఇటీవల టీజర్ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది.  పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ కలసి నిర్మిస్తున్న తమ సినిమాకు ‘ప్లే స్మార్ట్’ అన్నది ట్యాగ్ లైన్‌. వేస‌విలో విడుద‌ల కావాల్సిన ఈ సినిమా వాయిదా ప‌డతూ వచ్చింది. దీంతో ఖిలాడి విడుద‌ల ఎప్పుడుంటుందా? అని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న ర‌వితేజ అభిమానుల‌కు మేక‌ర్స్ రిలీజ్  న్యూస్ చెప్పేశారు. 

వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి 11న ‘ఖిలాడి’ సినిమా విడుద‌ల‌వుతుంది. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా ఫిబ్రవరి 4న విడుదలవుతుంది. అది విడుదలైన వారం రోజులకు రవితేజ ఖిలాడి థియేటర్స్ లో సందడి చేయడానికి రెడీ అవుతుందన్నమాట. విభిన్న యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. హవీష్ ప్రొడక్షన్‌ రూపొందిస్తున్న ఈ సినిమాకు శ్రీకాంత్ విస్సా, దేవీ శ్రీ ప్రసాద్ సోదరుడు సాగర్ డైలాగ్స్ అందిస్తుండటం విశేషం. 

Also read Ravanasura First Look: పది తలల రావణుడిగా రవితేజ.. పవర్ ఫుల్ లుక్ వైరల్

మ‌రో వైపు ర‌వితేజ డెబ్యూ డైరెక్ట‌ర్ శ‌ర‌త్ మండ‌వ ద‌ర్శ‌క‌త్వంలో రామారావు ఆన్ డ్యూటీ సినిమాను పూర్తి చేస్తూనే, త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో క‌మ‌ర్షియ‌ల్ మూవీ షూటింగ్‌ను పూర్తి కానిచ్చేస్తున్నాడు. అలాగే 70వ సినిమాగా సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో రావ‌ణాసురను అనౌన్స్ చేశాడు. అలాగే 71వ సినిమాగా వంశీ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో టైగ‌ర్ నాగేశ్వ‌ర్ రావు సినిమాను అనౌన్స్ చేశాడు. రావ‌ణాసుర‌, టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు సినిమాలు.. వ‌చ్చే ఏడాదినే సెట్స్ పైకి వెళ్ల‌నున్నాయి.
 

 

PREV
click me!

Recommended Stories

Mohan Babu: రాజమౌళికి పొగరు, రాఘవేంద్రరావుకి అహంకారం ఎక్కువ.. మోహన్ బాబు సంచలన కామెంట్స్..
ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య పోటీ వల్ల ఆర్టిస్టులు ఎలా నష్టపోయేవారో తెలుసా? సీనియర్ నటుడు చంద్రమోహన్ సంచలన కామెంట్స్..