ప్రభాస్ టీమ్ మాత్రం ముందస్తుగానే ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించబోతున్నారు. ఈ నెల 23న `రాధేశ్యామ్` ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించబోతున్నారు.
రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి వస్తోన్న మరో పాన్ ఇండియా చిత్రం `రాధేశ్యామ్`. `జిల్` ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా రిలీజ్‌కి రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల జోరు పెంచారు. ఇప్పటికే మూడు పాటలు విడుదల చేసింది యూనిట్. వాటికి మంచి స్పందన లభిస్తుంది. ఇక ముందుగానే ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని ప్లాన్ చేశారు. `పుష్ప` సినిమా ప్రమోషన్స్ ఆలస్యంగా స్టార్ట్ చేయడంతో చాలా టెన్షన్ పడాల్సి వచ్చింది. దీంతో ప్రభాస్ టీమ్ మాత్రం ముందస్తుగానే ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించబోతున్నారు. ఈ నెల 23న `రాధేశ్యామ్` ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించబోతున్నారు.
ప్రభాస్ అభిమానులకు సరికొత్త సినిమాటిక్ ఫీల్ ఇవ్వడానికి `రాధేశ్యామ్` మేకర్స్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇండియాలో మరే సినిమాకు సాధ్యం కాని స్థాయిలో ఓకే సినిమా కోసం రెండు డిఫరెంట్ మ్యూజిక్ టీమ్స్ వర్క్ చేస్తున్నాయి. ఇటు సౌత్.. అటు నార్త్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా అత్యున్నత సంగీత దర్శకులతో పాటలు సిద్ధం చేయిస్తున్నారు రాధే శ్యామ్ టీం. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పూర్తైపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన రాధే శ్యామ్ పాటలన్నింటికీ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్‌డేట్ బయటికి వచ్చింది. డిసెంబర్ 23న సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. అభిమానులే అతిథులుగా ఈ పాన్ ఇండియన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ కార్యక్రమం రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుంది. పూర్తిగా కోవిడ్ నిబంధనలు పాటించి ఈ వేడుక నిర్వహించబోతున్నారు. అక్కడికి వచ్చిన అభిమానులు అతిథులు నిబంధనలకు కట్టుబడి రావాలి అంటూ చిత్ర యూనిట్ తెలిపారు. అదే రోజు 5 భాషలకు సంబంధించిన ట్రైలర్ విడుదల కానుంది. అంతే కాదు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు అక్కడికి రానున్నారు. వాళ్ళ చేతుల మీదుగానే ట్రైలర్ విడుదల కానుంది.
ప్రభాస్ లాంటి పాన్ ఇండియన్ హీరో.. తన సినిమా ట్రైలర్ అభిమానులతో విడుదల చేయించడం నిజంగా గొప్ప విషయం. ఈ సినిమా కోసం చాలా మంది సంగీత దర్శకులు పని చేస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్, అర్జిత్ సింగ్, మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్, జబిన్ నౌతీయల్, మనోజ్ ముంటాషిర్, కుమార్, రష్మీ విరాగ్ బృందం అంతా కలిసి సౌత్, నార్త్ వర్షన్స్‌కు రాధే శ్యామ్ సినిమాకు అద్భుతమైన క్లాసిక్ సంగీతం అందిస్తున్నారు. ఇండియన్ సినిమా హిస్టరీలో ఒకేసారి ఒక సినిమాకు రెండు భాషల్లో వేర్వేరు సంగీత దర్శకులు పని చేయడం ఇదే తొలిసారి.
మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ.. కమల్ కన్నన్ విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. కోటగిరి వెంకటేశ్వరరావు దీనికి ఎడిటింగ్ వర్క్ చేశారు. యువి క్రియేషన్స్ ప్రొడక్షన్స్ వాల్యూస్ చాలా ఉన్నతంగా ఉన్నాయి. ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్ చాలా మంచి ప్లానింగ్‌తో డిజైన్ చేశారు. సౌండ్ ఇంజనీర్ రసూల్ పూకుట్టి వర్క్ అదనపు ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి దర్శక నిర్మాతలు. జనవరి 14, 2022న సినిమా విడుదల కానుంది.
also read: