
‘రంగస్థలం’ బ్లాక్ బస్టర్ తర్వాత సుకుమార్, ‘అల వైకుంఠపురములో’ సూపర్ హిట్ తర్వాత అల్లు అర్జున్ కాంబినేషన్ లోని మూడో సినిమా.. మొదటి భాగం ‘పుష్ప ది రైజ్’ థియేటర్స్ లోకి ఈ రోజే (శుక్రవారం) వచ్చింది. తగ్గేదేలే .. అంటూ విడుదలకు ముందు తెగ హడావిడి చేసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి మాంచి మాస్ ఫీస్ట్ ఇచ్చాడు అంటున్నారు. మరో ప్రక్క సుమారు 200 సినిమాల్లో విభిన్న పాత్రల్లో నటించిన సునీల్ తాజాగా పుష్ప లో విలన్ గా చేసాడు. ఈ సినిమా తర్వాత విలన్ గా తాను ఫుల్ బిజీ అయ్యిపోతాను అని భావిస్తున్నాడు. అది జరుగుతుందా..సునీల్ పాత్రకు రెస్పాన్స్ ఎలా వచ్చిందో చూద్దాం.
ఈ సినిమాలో స్మగ్లింగ్ సిండికేట్ కు బాస్ గా కనిపిస్తాడు సునీల్. అతను పేరు మంగళం శ్రీను. చాలా ఢిఫరెంట్ క్యారక్టరైజేషన్, మేకప్ తో సునీల్ కనిపిస్తాడు. అతన్ని పుష్ప ఎదిరిస్తాడు. అనసూయ అతని భార్య ద్రాక్షాయని గా కనిపిస్తుంది. పుష్పకు, మంగళం శ్రీనుకు మధ్య చాలా సీన్స్ ఉన్నాయి. సమంత ఐటం సాంగ్ కూడా సునీల్ అడ్డాలోనే జరుగుతుంది. ఇంటర్వెల్ లో సునీల్ కు అల్లు అర్జున్ వార్నింగ్ ఇస్తాడు. అలా సునీల్ క్యారక్టర్ కు సినిమాలో చాలా ప్రయారిటీ ఉంటుంది. సునీల్ పాత్ర చాలా క్రూరంగా నిర్ధాక్ష్యంగా సాగుతుంది. అలాంటి వ్యక్తిని పుష్ప ఎదిరిస్తాడు. అయితే సునీల్ పాత్ర డిఫరెంట్ గా ఉన్నమాట నిజమే కానీ..భయం అయితే పుట్టించలేకపోయింది. అలాగే అనసూయ పాత్ర కూడా ఊహించినంత గొప్పగా లేదు. ఏదో ఉందంటే ఉంది. లేదు అంటే లేదు అన్నట్లు సాగుతుంది. ఆమె మీద చిన్న ట్విస్ట్ ఉంటుంది అంతే.
తన పాత్ర విషయంపై సునీల్ స్పందిస్తూ.. తన క్యారెక్టర్ పేరు మంగళం శీను అని చెప్పాడు. పూర్తి నెగెటివ్ క్యారెక్టర్ … ఇంకా చెప్పాలంటే తన జీవితంలో ఒక పది సంవత్సరాలు పెద్ద వయస్సు క్యారెక్టర్ చేశానని అన్నారు. తాను ఇండస్ట్రీ కి వచ్చింది విలన్ గా నటిద్దామని.. అయితే ఇప్పటికి తాను విలన్ గా నటించినట్లు చెప్పారు. ఈ సినిమాలోని నా క్యారెక్టర్ గురించి సుకుమార్ కరోనా కు ముందు చెప్పారని.. తన పాత్రకు తాను న్యాయం చేసినట్లు భావిస్తున్నట్లు సునీల్ తెలిపారు.
పుష్ప సినిమాలో అందరూ నాచురల్ గా నటిస్తున్నారు..నేను డ్రమాటిక్ గా చేస్తే నేచురల్ మిస్సవుతుంది అనుకొని నేచురల్ గానే నటించానని తెలిపారు. ఒక సందర్భంలో మల్టిపుల్ తింగ్స్ ప్లే అవుతు వుంటాయి.. సుకుమార్ అందరినీ పాత్రలకు తగ్గట్టు ప్రిపేర్ చేసి చేయించాడని తెలిపారు. అడవిలో షూటింగ్ జరుగుతున్న సమయంలో తనకు ఏ ఫోన్ కాల్ రాకూడదని కోరుకునేవాడినని.. తెలిపారు. సినిమా అంటే పేషన్ వుంటేనే కానీ మైత్రి వారు ఈలాంటి సినిమాలు చేయరని .. తాను ఒకే టైప్ పాత్రలు చేయాలని అనుకోవడంలేదని.. తనకు ఎలాంటి పాత్ర ఇచ్చినా ఛాలెంజ్ గా తీసుకుని నటిస్తానని చెప్పారు. అంతేకాదు తెలుగులోనే కాదు.. ఏ భాషలోనైనా తాను నటిస్తానని సునీల్ చెప్పారు.
also read: Pushpa:సమంత ఐటెం సాంగ్ కి రెస్పాన్స్ ఏంటో తెలుసా?