
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ చిత్రం మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. డిసెంబర్ 5 ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. అయితే ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న రాజా సాబ్ టీజర్ ని జూన్ 16న రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది.
ప్రకటించినట్లుగానే చిత్ర యూనిట్ తాజాగా రాజా సాబ్ టీజర్ ని రిలీజ్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రాజా సాబ్ టీజర్ లాంచ్ హంగామా ఒక రేంజ్ లో జరిగింది. రెబల్ స్టార్ ఫ్యాన్స్ కోసం చిత్ర యూనిట్ తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లోని థియేటర్స్ లో టీజర్ ప్రదర్శించారు. అదే విధంగా యూట్యూబ్ లో కూడా రిలీజ్ చేశారు.
ఒక కోటలో దెయ్యం నేపథ్యంలో జరిగే కథ ఇది. టీజర్ లో విజువల్స్ మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఉన్నాయి. యాక్షన్ సన్నివేశాలు కూడా గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. ప్రభాస్ క్యారెక్టర్ ని డైరెక్టర్ మారుతి రొమాంటిక్ గా, ఫన్నీగా ప్రజెంట్ చేశారు.
ఈ ఇల్లు నా దేహం, ఈ సంపద నా ప్రాణం.. నా తదనంతరం కూడా దీన్ని నేను మాత్రమే అనుభవిస్తాను అంటూ వచ్చే వాయిస్ ఓవర్ తో టీజర్ ప్రారంభం అవుతుంది. సంజయ్ దత్ దెయ్యంగా నటిస్తున్నట్లు టీజర్ ద్వారా అర్థం అవుతోంది.
దెయ్యం ఉన్నట్లు చూపించిన సన్నివేశాలు థ్రిల్లింగ్ గా, భయాన్ని కలిగించేలా ఉన్నాయి. దెయ్యం ప్రభాస్ ని ఆవహించడం వల్ల జరిగే పరిణామాలు ఈ చిత్రంలో ఆసక్తికరంగా ఉండబోతున్నాయి. టీజర్ లో 'అమ్మా దుర్గమ్మ తల్లీ కాపాడమ్మా' అంటూ ప్రభాస్ ఫన్నీగా చెప్పే డైలాగ్ నవ్వులు పూయిస్తోంది. టీజర్ లో థమన్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. మొత్తంగా రాజా సాబ్ టీజర్ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు.