`కుబేర` ట్రైలర్ వచ్చింది.. నీతి న్యాయం కాదు, డబ్బు, పవరే పని చేస్తుంది.. రాజమౌళి ఫిదా, ఆయన ఏమన్నాడంటే

Published : Jun 16, 2025, 12:23 AM IST
kubera trailer, rajamouli

సారాంశం

నాగార్జున, ధనుష్‌, రష్మిక మందన్నా కలిసి నటించిన `కుబేర` చిత్రం నుంచి ట్రైలర్ వచ్చింది. దీనిపై దర్శకుడు రాజమౌళి ప్రశంసలు కురిపించారు. 

ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నా కలిసి నటిస్తోన్న హైలీ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియా మూవీ 'కుబేర'. దీనికి సెన్సిబుల్‌ డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహిస్తుండటం విశేషం. ఇప్పటికే విడుదలైన `కుబేర` ప్రమోషనల్ కంటెంట్ ఆకట్టుకుంటోంది. సినిమాపై అంచనాలను పెంచుతుంది. పాటలు కూడా ఆకట్టుకుంటున్నాయి. 

శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని హై బడ్జెట్ హై ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మిస్తున్నారు. `కుబేర` తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.

`కుబేర` ట్రైలర్‌ ఎలా ఉందంటే?

ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించారు. దీనికి రాజమౌళి ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ ఈవెంట్‌లో `కుబేర` ట్రైలర్‌ని విడుదల చేశారు.  ట్రైలర్‌ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. ఈ సినిమా డబ్బు, పవర్‌ చుట్టూ తిరుగుతుందని, దానికోసమే ప్రధాన పాత్రల మధ్య సంఘర్షణ అని ట్రైలర్‌ చూస్తుంటే అర్థమవుతుంది. 

ఇందులో `కోట్లు కోట్లు కోట్లు అంటే ఎంత సార్‌` అని ధనుష్‌ చెప్పడం, `ఆయిల్‌ అంటే సాధారణ విషయం కాదు, మనందరి తొక్క తీసి పదవి నుంచి తీసేసే పవర్‌ ఫుల్‌ మిషన్‌` అని విలన్లు మాట్లాడుకోవడం, `ఈ దేశంలో డబ్బు, పవరే పని చేస్తాయి, నీతి న్యాయాలు కాదు, ఇది చరిత్ర` అని నాగార్జున చెప్పడం, ఆయన్ని పోలీసులు తీసుకెళ్లడం వంటివి ట్రైలర్‌లో ఆసక్తికరంగా సాగాయి.

క్యూరియాసిటీని క్రియేట్‌ చేస్తోన్న `కుబేర` ట్రైలర్

అనంతరం `వాళ్ల మీద చేయి వేయడానికి లేదు అని, నా పేరు దీపక్ అని ధనుష్‌ని నాగార్జున పరిచయం చేసుకోవడం, బిచ్చగాడిని తీసుకొచ్చి పెద్ద ప్యాలెస్‌లో ఉంచి రాజభోగాలు కల్పించడం, ఆ తర్వాత అమ్మ అమ్మ అంటూ ధనుష్‌.. రష్మిక వెంట పడటం, ఆమె ఎందుకురా నా వెంట పడుతున్నావని చెప్పడం, అనంతరం ధనుష్‌ గాయాల పాలు కావడం, మీరు తప్ప నాకు ఎవరూ తెలియదు మేడం అని ఆయన చెప్పడం ఆసక్తికరంగా అనిపించింది. 

నాగార్జున నుంచి ధనుష్‌ పారిపోవడం, ఆయన కోసం వెతకడం, ముష్టివాడు ప్రభుత్వానే రిస్క్ లో పడేశాడని విలన్లు మాట్లాడుకోవడం, నాగార్జున టెన్షన్‌ పడటం, అనంతరం తాను అక్కడే తేల్చుకుంటానని ధనుష్‌ మళ్లీ వెళ్లిపోయి ముష్టివాడిగా మారడం, దేవుడిని పూజించడం ఆద్యంతం సస్పెన్స్ తో సాగాయి. 

క్యూరియాసిటీని క్రియేట్‌ చేస్తున్నాయి. డబ్బు పవర్‌ చుట్టూనే సినిమా సాగుతుందని అనిపించినా, ఈ పాత్రల మధ్య సంబంధం ఎలా ఉంటుంది, కథని దర్శకుడు ఎలా తీసుకెళ్తున్నాడనేది సస్పెన్స్ గా ఉంది. అవే సినిమాలో హైలైట్‌గా ఉండబోతుందని తెలుస్తుంది. విజువల్‌ పరంగా ఆకట్టుకుంది.

`కుబేర` ట్రైలర్‌పై రాజమౌళి రివ్యూ 

ఇక `కుబేర` ట్రైలర్‌ గురించి, సినిమా గురించి గెస్ట్ గా వచ్చిన దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ, ప్రశంసలు కురిపించారు. శేఖర్ కమ్ముల చాలా సాఫ్ట్ గా, హంబుల్ గా ఉంటారు. కానీ ఆయన చాలా దృఢ నిశ్చయం కలిగిన మనిషి. తను నమ్మిన సిద్ధాంతానికి ఏది అడ్డు వచ్చినా ఒక్క ఇంచ్ కూడా పక్కకు జరగరు. ఆ క్వాలిటీని నేను చాలా ఆరాధిస్తాను. 

శేఖర్ నమ్మిన సిద్ధాంతాల మీద సినిమాలు తీస్తారు. నేను నమ్మిన సిద్ధాంతాలకి, చేసే సినిమాలు కి సంబంధం ఉండదు. మేము కంప్లీట్ అపోజిట్. ఆయన అంటే నాకు అపారమైన గౌరవం. శేఖర్‌ ఇండస్ట్రీకి వచ్చి 25 సంవత్సరాల అయిందంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు. ఆయన నాకు జూనియర్ అనుకున్నాను కానీ నాకంటే వన్ ఇయర్ సీనియర్. ఈ 25 సంవత్సరాల్లో అలాగే ఉన్నాడు. తను నమ్మిన సిద్ధాంతాలతోనే సినిమాలు తీశాడు. ఆయన అలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను.

శేఖర్‌ కమ్ములపై రాజమౌళి ప్రశంసలు

నాగార్జున గారు, శేఖర్ కమ్ముల, టైటిల్ `కుబేర` అని ఈ ప్రాజెక్ట్ వచ్చిన వెంటనే ఫెంటాస్టిక్ గా అనిపించింది. ధనుష్ కూడా ఇందులో ఉన్నారని తెలిసిన తర్వాత అద్భుతమైన కాంబినేషన్ అనిపించింది. ట్రాన్స్ అఫ్ కుబేర రిలీజ్ అయిన తర్వాత మైండ్ బ్లోయింగ్ అనిపించింది. 

ఒక రిచ్ ప్రపంచంలో నాగార్జున గారు, పూర్ ప్రపంచంలో ధనుష్ గారు.. సినిమా కథ గురించి ఏమి చెప్పకుండా ఈ రెండు క్యారెక్టర్స్ ని చూపించడం చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. శేఖర్ కమ్ముల తన సినిమాని ట్రైలర్ లోనే చెప్పేస్తారు. కానీ `కుబేర` విషయానికి వస్తే ఒక సస్పెన్స్ సినిమా లాగా అనిపిస్తుంది. 

నాగార్జునని ధనుష్‌ ని ఎలా కలిపిపాడు? వాళ్ళ మధ్య డ్రామా ఏంటి? అనేది చాలా క్యూరియాసిటిగా అనిపిస్తుంది. దీని కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నాను. ట్రైలర్ ఆసక్తిని మరింత పెంచింది. మైండ్ బ్లోయింగ్ విజువల్స్. ప్రొడక్షన్ డిజైన్ అద్భుతంగా ఉంది. ప్రతిది టాప్ క్లాస్ లో వున్నాయి. దేవిశ్రీ ఇచ్చిన నాది నాది సాంగ్, కుబేర థీమ్ ఇవన్నీ ఫెంటాస్టిక్ గా ఉన్నాయి. జూన్ 20. డోంట్ మిస్ కుబేర` అని అన్నారు రాజమౌళి.

 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?