ఫ్యాన్స్ కి మరో సర్‌ప్రైజ్‌ ఇచ్చిన ప్రభాస్‌.. ఆదిపురుష్‌ ఆరంభ్‌..

Published : Feb 02, 2021, 09:53 AM IST
ఫ్యాన్స్ కి మరో సర్‌ప్రైజ్‌ ఇచ్చిన ప్రభాస్‌.. ఆదిపురుష్‌ ఆరంభ్‌..

సారాంశం

ప్రభాస్‌.. రాముడిగా నటిస్తున్న చిత్రం `ఆదిపురుష్‌`. బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రమిది. పౌరాణిక గాథ రామాయణం ఆధారంగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు.  ఈ సినిమా నేడు మంగళవారం ముంబయిలో ప్రారంభమైంది.

ప్రభాస్‌.. రాముడిగా నటిస్తున్న చిత్రం `ఆదిపురుష్‌`. బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రమిది. పౌరాణిక గాథ రామాయణం ఆధారంగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఇందులో రాముడిగా ప్రభాస్‌ నటిస్తుంటే, రావణుడిగా సైఫ్‌ అలీ ఖాన్‌ నటిస్తున్నారు. ప్రభాస్‌ తల్లి అంటే రాముడి తల్లి కౌసల్యగా హేమా మాలిని నటించే అవకాశాలున్నాయని, అలాగే సీతగా కృతి సనన్‌ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. 

ఇదిలా ఉంటే ఈ సినిమా నేడు(మంగళవారం) ప్రారంభమైంది. ముంబయిలో ఈ సినిమా ప్రారంభమైనట్టు అటు దర్శకుడు ఓం రౌత్‌, హీరో ప్రభాస్‌ సోషల్‌ మీడియా ద్వారా పేర్కొన్నారు. `ఆదిపురుష్‌ ఆరంభ్‌` అని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ స్టార్ట్ అయ్యింది. వీఎఫ్‌ఎక్స్ వర్క్ ని ప్రారంభించారు. మోషన్‌ క్యాప్చర్‌ టెక్నాలజీ వర్క్‌కు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. 

టీ సిరీస్‌ బ్యానర్‌ పతాకంపై భూషణ్‌ కుమార్‌, కృషన్‌ కుమాలతోపాటు ఓం రౌత్‌, ప్రసాద్‌ సుతార్‌, రాజేష్‌ నాయర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ వంటి భాషల్లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈసినిమా విడుదల తేదీని కూడా ప్రకటించిన చిత్ర బృందం. వచ్చే ఏడాది ఆగస్ట్ 11న విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. ఇప్పటికే ప్రభాస్‌ `రాధేశ్యామ్‌`లో నటిస్తున్నారు. ఇది చివరి దశకు చేరుకుంది. మరోవైపు `సలార్‌` షూటింగ్‌ని ఇటీవలే రామగుండంలో ప్రారంభించారు. ఏకకాలంలో `సలార్‌`, `ఆదిపురుష్‌` సినిమాల్లో ప్రభాస్‌ నటించనున్నారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు