`నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌`.. ఖండించిన దర్శకుడు శంకర్‌..షాక్‌కి గురయ్యానని వెల్లడి

By Aithagoni RajuFirst Published Feb 1, 2021, 9:06 PM IST
Highlights

తనకు కోర్ట్ నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసినట్టు వచ్చిన వార్తలను దర్శకుడు శంకర్‌ ఖండించారు. ఈ వార్తలు చూసి షాక్‌కి గురైనట్టు చెప్పారు. ఈ మేరకు ఆయన సోమవారం సాయంత్రం ఓ ప్రెస్‌ నోట్‌ని విడుదల చేశారు. ఇవన్నీ ఫాల్స్ న్యూస్‌ అని కొట్టిపారేశారు.

తనకు కోర్ట్ నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసినట్టు వచ్చిన వార్తలను దర్శకుడు శంకర్‌ ఖండించారు. ఈ వార్తలు చూసి షాక్‌కి గురైనట్టు చెప్పారు. ఈ మేరకు ఆయన సోమవారం సాయంత్రం ఓ ప్రెస్‌ నోట్‌ని విడుదల చేశారు. ఇవన్నీ ఫాల్స్ న్యూస్‌ అని కొట్టిపారేశారు. నిరాధారమైన వార్తలు స్ర్పెడ్‌ చేయడంపై ఆయన మండిపడ్డారు. నిజానిజాలు తెలుసుకోకుండా ఇలాంటి వార్తలు ఎలా రాస్తారన్నారు. కోర్ట్ తనకు ఎలాంటి వారెంట్‌ జారీ చేయలేదని స్పష్టం చేశారు. 

ఆయన చెబుతూ, `నాకు ఎగ్మోర్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్ట్ నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసిందని వచ్చిన ఫాల్స్ న్యూస్‌ విని షాక్‌ కి గురయ్యాను. మా అడ్వకేట్‌ మిస్టర్‌ సాయి కుమారన్‌ దీనిపై కోర్ట్ ని ఆశ్రయించారు. తనకు ఎలాంటి వారెంట్‌ జారీ చేయలేదని నిర్ధారించారు. కానీ ఎలాంటి నిర్ధారణ చేసుకోకుండా, ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయడం నన్ను ఆశ్చర్యానికి గురి చేశాయి ఇలాంటి వార్తలు నిజ నిర్ధారణ చేసుకొని రాయాలని మీడియా వారిని కోరుతున్నా. ఇలాంటి తప్పుడు వార్తలను మరోసారి ప్రచారం చేయవద్దని కోరుకుంటున్నా` అని పేర్కొన్నారు. 

Director Shankar Press Statement ⁦⁩ pic.twitter.com/wWfv1RCZaF

— Team Aim (@teamaimpr)

శంకర్‌, రజనీకాంత్‌ కాంబినేషన్‌లో `రోబో` చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. 11ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. అయితే ఈ చిత్ర తనది అని, శంకర్ కాపీ కొట్టారని ఓ రైటర్‌ కోర్ట్ ని ఆశ్రయించగా, ఈ కేసు నాన్చుతూ వస్తోంది. కోర్ట్ కి శంకర్‌ హాజరు కాలేదని, దీంతో కోర్ట్ నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసిందని వార్తలు వచ్చాయి. 

ఇక ఇప్పుడు శంకర్‌ `ఇండియన్‌ 2` చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కమల్‌ హాసన్‌ హీరోగా రూపొందుతున్న చిత్రమిది. అనేక ప్రమాదాలు ఈ సినిమాని వెంటాడుతున్నాయి. దీంతో షూటింగ్‌ని వాయిదా వేశారు. ఇప్పట్లో ఈ సినిమా ఉండే అవకాశం లేదని టాక్.

click me!