
2013 ఉత్తమ నటుడి అవార్డు దక్కించుకుని పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు లకు షాక్ ఇచ్చాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. అత్తారింటికి దారేది , సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాలు 2013 లో అద్భుత విజయాలను అందుకున్నాయి దాంతో ఆ చిత్రాలతో పాటు మహేష్ బాబు , పవన్ కళ్యాణ్ లలో ఎవరో ఒకరి ఉత్తమ నటుడు అవార్డు వస్తుందని అనుకున్నారు పవన్ ఫ్యాన్స్ అలాగే మహేష్ ఫ్యాన్స్ కానీ వాళ్ళిద్దరిని కాకుండా ప్రభాస్ ని ఉత్తమ నటుడు అవార్డు వరించడంతో మిగతావాళ్ళు షాక్ అయ్యారు.
మిర్చి సినిమా కూడా 2013 లో రిలీజ్ అయి పెద్ద హిట్ అయ్యింది అయితే మిర్చి కంటే భారీ విజయాలను సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సాధించగా 80 సంవత్సరాల తెలుగు చలనచిత్ర చరిత్ర ని తిరగరాసి సంచలన విజయం అందుకుంది అత్తారింటికి దారేది. పైగా అత్తారింటికి దారేది కానీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు కానీ సకుటుంబ సపరివార సమేతంగా చూడతగ్గ చిత్రాలు.
అయితే మిర్చి లో మాస్ అంశాలు పుష్కలంగా ఉండటమే కాకుండా... సమాజానికి ఓ మంచి సందేశం కూడా ఉండటంతో ప్రభాస్ తో పాటు మిర్చి పలు అవార్డులను సొంతం చేసుకుంది.