ప్రభాస్‌ షేప్‌ ఔట్‌.. ట్రీట్‌మెంట్‌ కోసం ఏకంగా యూకేకి.. ?

By Aithagoni Raju  |  First Published Sep 11, 2021, 4:05 PM IST

ప్రభాస్‌ నటిస్తున్న చిత్రాల్లో `ఆదిపురుష్‌` ఒకటి. ఇందులో రాముడిగా ప్రభాస్‌ నటిస్తున్నాడు. రాముడంటే ఫిట్‌గా, కండలు తిరిగిన దేహంతో, పర్‌ఫెక్ట్ బాడీతో ఉంటాడనేది మనం అనేక ఫోటోలు, సినిమాలు, సీరియల్స్ లో చూశాం. కానీ ప్రభాస్‌ ఆ లుక్‌ని కోల్పోయాడట. 


అమ్మాయిల డార్లింగ్‌.. ప్రభాస్‌ ఇప్పుడు ఆ గ్లామర్‌ని కోల్పోతున్నాడు. గత కొన్ని రోజులుగా ఆయన బాడీలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎంతో ఫిట్‌గా ఉండే ప్రభాస్‌ ఇటీవల భారీగా, పెద్ద వయస్కుడిగా కనిపిస్తున్నాడు. ఆయన ఫేస్‌ లుక్‌ కూడా మారిపోయింది. ఇటీవల ఒకటి రెండు సందర్భాల్లో మీడియా కంటపడినప్పుడు కూడా ఆయన గుర్తు పట్టలేనంతగా మారిపోయారు. ఇప్పుడితే ప్రభాస్‌కి కష్టాలు తీసుకొస్తుంది. ముఖ్యంగా రాముడి కోసం కష్టపడాల్సి వస్తుంది. 

ప్రభాస్‌ నటిస్తున్న చిత్రాల్లో `ఆదిపురుష్‌` ఒకటి. ఇందులో రాముడిగా ప్రభాస్‌ నటిస్తున్నాడు. రాముడంటే ఫిట్‌గా, కండలు తిరిగిన దేహంతో, పర్‌ఫెక్ట్ బాడీతో ఉంటాడనేది మనం అనేక ఫోటోలు, సినిమాలు, సీరియల్స్ లో చూశాం. కానీ ప్రభాస్‌ ఆ లుక్‌ని కోల్పోయాడట. మొదట తాను అనుకున్నట్టుగా ప్రభాస్‌ లేడని, దీంతో ఆయన్ని ఫిట్‌గా తయారు చేయించాలని దర్శకుడు ఓం రౌత్‌ భావిస్తున్నారు. భావించడమే కాదు, పోయిన ఫిట్‌నెస్‌ని తీసుకొచ్చేందుకు యూకేకి పంపిస్తున్నారు. 

Latest Videos

రాముడి లుక్‌ విషయంలో ప్రభాస్‌ లుక్‌ కంటిన్యూటీ ఉండటం లేదని, దాన్ని కరెక్ట్ గా మెయింటేన్‌ చేయడం కోసం యూకేలోని ఓ డాక్టర్‌ సమక్షంలో ప్రభాస్‌ ట్రైనింగ్‌ తీసుకోబోతున్నారట. యూకే లోని వరల్డ్ క్లాస్ డాక్టర్ ..  డైటీషన్ వద్ద ప్రభాస్‌ అత్యుత్తమ చికిత్స తీసుకోవడానికి నిర్ణయించుకున్నారని, ఈ మేరకు ప్రభాస్ సీక్రెట్ గా యుకే పయనమయ్యాడని వార్తలు వినిపిస్తున్నాయి. `బాహుబలి` సినిమాలో రెండు రకాల పాత్రల కోసం, వాటిలో వేరియేష‌న్స్‌ను చూపించేందుకు ప్ర‌భాస్ బ‌రువు పెరగడం తగ్గడం వంటి సాహసాలు చేశారు.

`సాహో` కోసం మళ్ళీ స్లిమ్ గా మారాల్సి వచ్చింది. యాక్షన్ సీన్ల కోసం మళ్ళీ భారీ దేహధారుడ్యానికి మారాల్సి వచ్చింది. దీంతో ప్రభాస్ డైట్ లో విపరీతమైన మార్పులు వచ్చాయని అందుకే ఇప్పుడు ప్రభాస్ కు శరీర తీరు మారిందని అంటున్నారు. ప్రస్తుతం కూడా ప్రభాస్‌ `రాధేశ్యామ్‌`, `సలార్‌`, `ఆదిపురుష్‌`ల కోసం లుక్‌ మారుస్తున్నారు. ఇది కూడా ఆయన షేప్‌ ఔట్‌ కావడానికి కారణమవుతుందట. ఈ నేపథ్యంలో కంటిన్యూగా `ఆదిపురుష్‌` కోసం ప్రత్యేకంగా ఈ డైట్‌ తీసుకోబోతున్నారని టాక్. ఇక `ఆదిపురుష్‌`లో  సీతగా కృతి సనన్‌, రావణుడిగా సైఫ్‌ అలీ ఖాన్‌ నటిస్తున్నారు.

click me!