ప్రభాస్ ‘సలార్’ టీజర్ కి డేట్ ఫిక్స్.!!?

Published : Apr 18, 2023, 06:31 PM IST
ప్రభాస్ ‘సలార్’ టీజర్ కి డేట్ ఫిక్స్.!!?

సారాంశం

దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అయితే దీనిపై సలార్ టీం నుండి అఫీషియల్ అప్డేట్ రావాల్సి ఉంది. 


ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం సలార్. కేజీఎఫ్ సక్సెస్ తరువాత ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రం పై ఇండియా వైడ్ భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే.  ప్రస్తుతం ఈ మూవీ ఇటలీలో షూటింగ్ జరుపుకుంటుంది. అక్కడ ప్రభాస్ పై యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ షెడ్యూల్ గురించి ఇటీవల ఇటలీ మీడియా ఆర్టికల్ రాస్తూ.. సలార్ రెండు భాగాలుగా రాబోతుంది అంటూ పేర్కొన్నారు. దీంతో సలార్ టు పార్ట్స్ గా రాబోతుంది అన్న వార్త  మీడియాలో చక్కర్లు కొట్టేసింది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావోచ్చిందని తెలుస్తోంది.ఈ నేపధ్యంలో  ఈ సినిమా నుంచి టీజర్ ఎప్పుడొస్తుందా అనేది ఆసక్తికరమైన విషయంగా మారింది.
  
మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ప్రభాస్ సలార్ ఫస్ట్ లుక్ అలాగే టీజర్ ని జూన్ మూడో వారంలో విడుదల చేయుటకు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది.  ప్రస్తుతం ఆదిపురుష్ సినిమా ప్రమోషన్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సినిమా జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం చేశారు.  
ఈ క్రమంలో ప్రభాస్ ఫ్యాన్స్ కి జూన్ నెలలో డబల్ ట్రీట్ అని చెప్పవచ్చు. ప్రభాస్ కూడా తను చేస్తున్న సినిమాలకు సంబంధించిన డైరెక్టర్స్ కి ఆదిపురుష్ సినిమా విడుదలైన తర్వాతే అప్డేట్స్ ఇవ్వాలి అని ఫిక్స్ అయ్యారట. అందుకనే దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అయితే దీనిపై సలార్ టీం నుండి అఫీషియల్ అప్డేట్ రావాల్సి ఉంది. 

ఈ సినిమాలో జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, ఈశ్వరి రావు, భువన గౌడ కీలకమైన పాత్రలో చేస్తున్నారు అలాగే అత్యంత భారీ బడ్జెట్ తో హోంబలె ఫిలిమ్స్ బ్యానర్ వారు ఈ సినిమాని తరికెక్కిస్తున్నారు. సలార్ సినిమాని ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 28న విడుదలకు సిద్ధం చేస్తున్నారు మేకర్స్.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Thalapathy Vijay: నిర్మాత కూతురి వెడ్డింగ్ రిసెప్షన్ లో దళపతి విజయ్, పట్టు పంచెలో సందడి.. వైరల్ ఫోటోలు
Bigg Boss Telugu 9: భరణి మేనేజ్మెంట్ కోటా అని తేలిపోయిందా ? నిహారికతో నాగార్జున షాకింగ్ వీడియో వైరల్