Salaar Teaser : సలార్ టీజర్ రెడీ.. డేట్, టైమ్ ఫిక్స్.. టూ వయోలెంట్ గా పోస్టర్

By Asianet News  |  First Published Jul 3, 2023, 2:11 PM IST

మొత్తానికి దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రపంచంలోకి ప్రేక్షకులు అడుగుపెట్టే సమయం వచ్చింది. ‘సలార్’ టీజర్  సిద్ధంగా ఉంది. తాజాగా డేట్, టైమ్ ఫిక్స్ చేస్తూ మేకర్స్ అనౌన్స్ మెంట్ అందించారు. 
 


పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ (Prabhas) ఫ్యాన్స్ కు  గుడ్ న్యూస్ అందింది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న Salaar చిత్రం నుంచి బిగ్ అప్డేట్ అందింది. ఇప్పుడు ఇచ్చిన అప్డేట్ కు ఫ్యాన్స్ కు పూనకాలు ఖాయం. ‘కేజీఎఫ్’తో దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) ఆడియెన్స్ కు కొత్త ప్రపంచం చూపించిన విషయం తెలిసిందే. ఇక ప్రభాస్ తో చేతులు కలిసి మరో వరల్డ్ లోకి తీసుకెళ్లేందుకు, పవర్ యాక్షన్ తో దుమ్ములేపుందుకు సిద్ధమయ్యారు. 

ప్రశాంత్ నీల్ - ప్రభాస్ కాంబో సెట్ అయినప్పటి నుంచే ‘సలార్’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఇక అందుకు తగ్గట్టుగానే అప్డేట్స్ కూడా అందుతూ వచ్చాయి. అయితే కేవలం పోస్టర్లు తప్పా వీడియో రూపంలో ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. ఇక దానికి సమయం ఆసన్నమైంది. Salaar Teaser రిలీజ్ కు సిద్ధమైంది. ఈ మేరకు రిలీజ్ డేట్ అండ్ టైమ్ ను ఫిక్స్  చేస్తూ మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. 

Latest Videos

జూలై 6న ఉదయం 5 :12 నిమిషాలకు పవర్ ఫుల్ టీజర్ ను విడుదల చేయబోతున్నామని తెలిపారు. మోస్ట్ వయలెంట్ మ్యాన్ ను చూసేందుకు సిద్ధంగా ఉండండి అంటూ మేకర్స్ తెలిపారు. అనౌన్స్ మెంట్ తో పాటు గూస్ బంప్స్ తెప్పించే పోస్టర్ ను విడుదల చేశారు. డార్లింగ్ ప్రభాస్ ప్రత్యర్థులను ఎదుర్కొంటూ కనిపిస్తారు. ప్రభాస్ బీభత్సానికి ముందున్న వారంత భయపడటం చూస్తే టీజర్ పై మరింత ఆసక్తి పెరిగింది. టీజర్ 90 నిమిషాల పాటు ఉంటుందని తెలుస్తోంది.

మొత్తానికి డార్లింగ్ ఫ్యాన్స్ కు ఫూనకాలు తెప్పించే అప్డేట్ సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఈ పోస్టర్ కూడా నెట్టింట వైరల్ గా మారింది. ప్రభాస్ ఊరమాస్ లుక్ లో, హైవోల్టేజీ యాక్షన్ తో రాబోతున్నారకు. ఇప్పటికే షూటింగ్ పార్ట్ ఆల్మోస్ట్ ముగింపు దశకు వచ్చింది. మిగితా పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. 

ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తున్న విషయం తెలిసిందే. విలన్స్ గా ఫృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు నటిస్తున్నారు. తమిళ నటి శ్రియా రెడ్డి కీలక పాత్ర పోషించింది. హోంబలే ఫిల్మ్స్  భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సెప్టెంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. 

𝐁𝐫𝐚𝐜𝐞 𝐲𝐨𝐮𝐫𝐬𝐞𝐥𝐟 𝐟𝐨𝐫 𝐭𝐡𝐞 𝐦𝐨𝐬𝐭 𝐯𝐢𝐨𝐥𝐞𝐧𝐭 𝐦𝐚𝐧, 🔥

Watch on July 6th at 5:12 AM on https://t.co/QxtFZcNhrGpic.twitter.com/Vx1i5oPLFI

— Hombale Films (@hombalefilms)
click me!