‘సామజవరగమన’4 రోజులు కలెక్షన్స్, నైజాంలో అయితే షాకింగ్

Published : Jul 03, 2023, 12:17 PM IST
 ‘సామజవరగమన’4 రోజులు కలెక్షన్స్,  నైజాంలో అయితే షాకింగ్

సారాంశం

ఈ నెల 28 వరకు పెద్ద సినిమాలు లేకపోవడం వలన  నైజాంలో 6కోట్లు,  ఓవర్ సీస్ లో 750 k వరకు చేయోచ్చు అని అంచనా.  


ఇప్పుడు అందరూ సామజవరగమన చిత్రం గురించే మాట్లాడుతున్నారు.  అంతెందుకు సినిమాల గురించి సోషల్ మీడియాలో కామెంట్ చేయని రవితేజ మొదటిసారి సామజవరగమన చిత్రం గురించి ప్రత్యేకంగా ట్వీట్ చేయడం ఇప్పుడు చాలా ఆసక్తికరంగా వైరల్ గా మారింది. చాలా కాలం తర్వాత మనస్ఫూర్తిగా నవ్వుకున్నానని ఆయన చెప్పడం నిజంగా ఆ టీం కి కొత్త బూస్ట్ ఇచ్చిందని చెప్పవచ్చు. రవితేజ ట్వీట్ విషయానికి వస్తే.. ఒక సినిమా చూసి పగలబడి నవ్వుకొని చాలా రోజులైంది.. ఇక సామజవరగమన మూవీ చూస్తూ కంప్లీట్ గా ఎంజాయ్ చేశాను ఇక విపరీతమైన వినోదాన్ని పంచింది ఈ సినిమా.. శ్రీ విష్ణు తన పాత్రలో చాలా న్యాచురల్ గా అద్భుతంగా నటించాడు.

 నరేష్ , వెన్నెల కిషోర్ వంటి వారు కూడా తమ కామెడీ టైమింగ్ తో చించేశారు.. నిర్మాతలకు నా అభినందనలు ప్రత్యేకించి దర్శకుడు రామ్ అబ్బరాజు ఆయనకు రచన సహకారం అందించిన భాను భోగవరపు, నందు సావిరి గాని మీరంతా కూడా ఇంకా చాలా దూరం వెళ్లి మంచి సక్సెస్ అందుకోవాలి అంటూ ఆయన కామెంట్లు చేశారు. ఇకపోతే జూన్ 29వ తేదీన విడుదలైన ఈ సినిమా సక్సెస్ టాక్ తో దూసుకుపోతోంది.

కామెడీని వదిలేసి మాస్ వైపుకు వచ్చిన   శ్రీవిష్ణు కు ఈ మధ్య సరైన హిట్ లేదు.  ‘రాజ రాజ చోర’ తర్వాత ‘అర్జున ఫల్గుణ’ ‘భళా తందనాన’ ‘అల్లూరి’ వంటి ప్లాప్ లు పడ్డాక అతను హీరోగా వచ్చిన చిత్రం ‘సామజవరగమన’. కామెడీ చిత్రం కావటంతో   ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూశారు. ‘వివాహ భోజనంబు ఫేమ్ రామ్ అబ్బరాజు ఈ చిత్రానికి దర్శకుడు కావటం కూడా ప్లస్ అయ్యింది సామజవరగమన జూన్ 29న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. విడుదలైన అన్ని కేంద్రాల్లో మంచి టాక్‌తో స్క్రీనింగ్‌ అవుతూ.. శ్రీవిష్ణు టీంలో జోష్‌ నింపుతోంది. సినిమా నాలుగు  రోజులు కలెక్షన్స్ విషయానికి వస్తే..
 

మొదటి రోజు - 00.80cr
రెండో రోజు - 00.63cr
మూడో రోజు - 01.17cr 
నాలుగో రోజు - 01.16cr 

నాలుగు రోజులు కలెక్షన్స్ 

తెలంగాణా - 01.64cr

రాయలసీమ - 00.42cr

నెల్లూరు - 00.17cr

గుంటూరు - 00.27cr

కృష్ణా  - 00.28cr

వెస్ట్ గోదావరి  - 00.20cr

ఈస్ట్ గోదావరి  - 00.27cr

ఉత్తరాంధ్ర  - 00.46cr


తెలుగు రాష్ట్రాల నాలుగు  రోజులు టోటల్ థియేటర్ గ్రాస్ - 06.45cr

తెలుగు రాష్ట్రాల  నాలుగు  రోజులు టోటల్ థియేటర్ షేర్  - 03.71cr

కర్ణాటక + భారత్ లో మిగతా ప్రాంతాలు+ ఓవర్ సీస్- 01.70cr

ప్రపంచవ్యాప్తంగా  నాలుగు  రోజులు   మొత్తం గ్రాస్ - 10.10cr

ప్రపంచవ్యాప్తంగా నాలుగు  రోజులు  మొత్తం షేర్ - 05.41cr

ప్రపంచవ్యాప్తంగా మొత్తం నాలుగు  రోజులు  కలెక్షన్స్ - 03.50cr

 బ్లాక్ బస్టర్ 
 

ఈ నెల 28 వరకు పెద్ద సినిమాలు లేకపోవడం వలన  నైజాంలో 6కోట్లు,  ఓవర్ సీస్ లో 750 k వరకు చేయోచ్చు అని అంచనా.  ‘సామజవరగమన’ (Samajavaragamana) చిత్రానికి రూ.3.9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.4.2 కోట్ల షేర్ ను రాబట్టాలి. 

 ఈ చిత్రంలో బిగిల్‌ (విజిల్‌) ఫేం రెబా మోనికా జాన్‌ (Reba Monica John) ఫీ మేల్ లీడ్ రోల్‌ పోషించింది. సుదర్శన్‌, శ్రీకాంత్ అయ్యంగార్‌, వెన్నెల కిశోర్‌, రఘుబాబు, రాజీవ్ కనకాల, దేవీ ప్రసాద్‌, ప్రియ ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ తో కలిసి హాస్య మూవీస్‌ బ్యానర్‌ పై రాజేశ్‌ దండా నిర్మించారు.

సినిమాల గురించి సోషల్ మీడియాలో కామెంట్ చేయని రవితేజ మొదటిసారి సామజవరగమన చిత్రం గురించి ప్రత్యేకంగా ట్వీట్ చేయడం ఇప్పుడు చాలా ఆసక్తికరంగా వైరల్ గా మారింది. చాలా కాలం తర్వాత మనస్ఫూర్తిగా నవ్వుకున్నానని ఆయన చెప్పడం నిజంగా ఆ టీం కి కొత్త బూస్ట్ ఇచ్చిందని చెప్పవచ్చు. 
  

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?