సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ - బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ కాంబోలో వస్తున్నచిత్రం ‘యానిమల్’. చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తాజాగా దర్శకుడు మూవీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ (Sundeep Reddy Vanga) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ‘అర్జున్ రెడ్డి’ తెరకెక్కించి ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశారో తెలిసిందే. అదే సినిమాను హిందీలో బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ తోనూ రీమేక్ చేసి నార్త్ ఆడియెన్స్ ను ఆకట్టుకున్నారు. దీంతో నెక్ట్స్ నేరుగా హిందీలో భారీ చిత్రంగా ‘యానిమల్’తో రాబోతున్నారు.
యాక్షన్ ఫిల్మ్ గా వస్తున్న Animal చిత్రంలో రణ్బీర్ కపూర్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) కథానాయిక. డిసెంబర్ 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్ విడుదలై మాసీవ్ రెస్పాన్స్ ను దక్కించుకున్న విషయం తెలిసిందే. దీంతో హైప్ తారా స్థాయిలో ఏర్పడింది. ఇక తాజాగా సందీప్ రెడ్డి సినిమాపై మరింతగా అంచనాలు పెంచేశాడు.
యానిమల్ సినిమా గురించి మాట్లాడుతూ ఓ వీడియోను విడుదల చేశారు. ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సందీప్ రెడ్డి మాట్లాడుతూ.. మొదట మీరు చూసిన గ్లింప్స్ కేవలం షాంపిల్ మాత్రమే. అసలైన వయోలెన్స్ ఏంటో చూపిస్తా. కాస్తా ఆగండి. ఆగస్ట్ నెలలో రిలీజ్ కావాల్సిన ‘యానిమల్’ పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్ల డిలే అయ్యిందని తెలిపారు. డిసెంబర్ 1న థియేటర్లలో విశ్వరూపం చూడబోతున్నారని తెలిపారు.
ఇక చిత్రంలో మొత్తం ఏడు పాటలు ఉన్నాయని తెలిపారు. ఐదు భాషల్లో మొత్తం 35 పాటలు అవుతాయని అన్నారు. సాంగ్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించారన్నారు. హిందీ డబ్డ్ మూవీ అని ప్రేక్షకులకు అనిపించకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. తమ ప్రాంతీయ సినిమాగానే అనిపిస్తుందన్నారు. మొత్తానికి యానిమల్ కొత్త సినిమా రిలీజ్ డేట్ ను ఇలా అనౌన్స్ చేశారు. ఈ చిత్రం తర్వాత సందీప్ రెడ్డి తెలుగులో ప్రభాస్ తో ‘స్పిరిట్’ చేయబోతున్నారు. ఆ తర్వాత అల్లు అర్జున్ తో ఓ సినిమా తెరకెక్కించనున్నారు.