Salaar: డ్యామేజ్ కంట్రోల్.. 'సలార్' సెకండ్ ట్రైలర్ లోడింగ్, ఈసారి గురి తప్పదు.. ఎప్పుడంటే

Published : Dec 03, 2023, 04:12 PM IST
Salaar: డ్యామేజ్ కంట్రోల్.. 'సలార్' సెకండ్ ట్రైలర్ లోడింగ్, ఈసారి గురి తప్పదు.. ఎప్పుడంటే

సారాంశం

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సలార్ చిత్రంపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ట్రైలర్ లో చాలా గ్రాండ్ గా కనిపించింది. అయితే ఎక్కువగా కేజీఎఫ్ ఛాయలు ఉండడం, ప్రభాస్ పాత్రని ఆశించిన స్థాయిలో హైలైట్ చేయకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశ పడ్డారు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సలార్ చిత్రంపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పలుమార్లు వాయిదా పడ్డ సలార్ మూవీ డిసెంబర్ 22న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది.  దీనితో ఇటీవల సలార్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. 

కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ట్రైలర్ లో చాలా గ్రాండ్ గా కనిపించింది. అయితే ఎక్కువగా కేజీఎఫ్ ఛాయలు ఉండడం, ప్రభాస్ పాత్రని ఆశించిన స్థాయిలో హైలైట్ చేయకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశ పడ్డారు. సలార్ ట్రైలర్ పూర్తి స్థాయిలో కిక్కు ఇవ్వలేదు అనేది వాస్తవం. 

అయినప్పటికీ ట్రైలర్ యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతోంది. ఈ చిత్రంలో ప్రభాస్ మిత్రుడు పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. అయితే సలార్ అంచనాలని ట్రైలర్ కాస్త డ్యామేజ్ చేసింది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో డ్యామేజ్ కంట్రోల్ చేసేందుకు చిత్ర యూనిట్ పూనుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

Also Read: Anasuya:యానిమల్ లో వల్గర్ సీన్లు, బూతులు చూడలేదా.. ఆ హీరో అయితేనే, అనసూయని ఇరకాటంలో పెడుతూ కామెంట్స్

డిసెంబర్ 16న స్పెషల్ ఈవెంట్ నిర్వహించి సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొదటి ట్రైలర్ లో ఏ అంశాలు మిస్ అయ్యాయో ముఖ్యంగా ప్రభాస్ ఎంట్రీ లేటుగా జరిగింది.. అవన్నీ కవర్ చేస్తూ పవర్ ఫుల్ ట్రైలర్ కట్ చేస్తున్నట్లు టాక్. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి