Anasuya:యానిమల్ లో వల్గర్ సీన్లు, బూతులు చూడలేదా.. ఆ హీరో అయితేనే, అనసూయని ఇరకాటంలో పెడుతూ కామెంట్స్
గతంలో సందీప్ రెడ్డి వంగా, విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన అర్జున్ రెడ్డి చిత్రంపై అనసూయ విరుచుకుపడింది. ఆ చిత్రంలో డైలాగ్స్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అనసూయ వివాదం సృష్టించింది.
టాలీవుడ్ క్రేజీ యాంకర్, నటి అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బుల్లితెరపై వెలుగు వెలిగిన అనసూయ ఇప్పుడు నటిగా విలక్షణ పాత్రలు చేస్తోంది. అనసూయ వెండితెరపై గ్లామర్ పాత్రలు చేయనప్పటికీ నటనతో అందరిని మెప్పిస్తోంది.
గతంలో అనసూయ జబర్దస్త్ లాంటి షోలకు యాంకరింగ్ చేస్తూ బుల్లితెరపై గుర్తింపు పొందింది. అయితే అనూహ్యంగా అనసూయ టెలివిజన్ కి దూరమైంది. సినిమా ఆఫర్స్ ఎక్కువగా వస్తుండడంతో అనసూయ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే తన అందాలతో యువతని ఉక్కిరి బిక్కిరి చేసేందుకు అనసూయ సోషల్ మీడియాని ఎంచుకుంది. ఇంస్టాగ్రామ్ లో అనసూయ ఇచ్చే ఫోజులు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఇక రంగస్థలం, పుష్ప, క్షణం లాంటి చిత్రాలు అనసూయకి నటిగా మంచి క్రేజ్ తీసుకువచ్చాయి. అనసూయ చివరగా పెదకాపు చిత్రంలో నటిచింది. ఇప్పుడు పుష్ప 2, మరికొన్ని చిత్రాలతో బిజీగా ఉంది. వచ్చిన ప్రతి ఆఫర్ కి అనసూయ ఒకే చెప్పి ఉంటే ఈ పాటికి ఆమె చాలా చిత్రాల్లో స్పెషల్ రోల్స్ చేసి ఉండాలి. పాత్ర నచ్చితే లేడి ఓరియెంటెడ్ చిత్రంలో అయినా నటిస్తోంది.
అయితే అనసూయ తాజాగా షేర్ చేసిన ఫొటోస్ మాత్రం కిల్లింగ్ అనిపించేలా ఉన్నాయి. ఎప్పటిలాగే చీరకట్టులో సైతం అనసూయ కొంటెగా కసి చూపులతో కుర్ర హృదయాల్ని తగలబెట్టే విధంగా ఫోజులు ఇస్తోంది. సోఫాలో కూర్చుని కన్నిగీటుతూ చిలిపి చేష్టలతో హొయలు పోతోంది.
నేను వండర్ ఉమెన్ అంటూ అనసూయ పెట్టిన క్యాప్షన్ ఆసక్తికరంగా మారింది. అయితే అనసూయ ఫొటోస్ కి నెటిజన్లు పెడుతున్న కామెంట్స్ చాలా విభిన్నంగా ఉన్నాయి.కొందరు నెటిజన్లు అనసూయని టార్గెట్ చేస్తూ యానిమల్ చిత్రంతో ముడిపెడుతూ ట్రోల్ చేస్తున్నారు.
గతంలో సందీప్ రెడ్డి వంగా, విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన అర్జున్ రెడ్డి చిత్రంపై అనసూయ విరుచుకుపడింది. ఆ చిత్రంలో డైలాగ్స్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అనసూయ వివాదం సృష్టించింది. విజయ్ దేవరకొండపై కూడా కామెంట్స్ చేసింది. ఆ తర్వాత చాలా కాలం పాటు అనసూయ, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మధ్య వివాదం,మాటల యుద్ధం కొనసాగడం చూశాం.
అయితే డిసెంబర్ 1న సందీప్ కొత్త చిత్రం రణబీర్ హీరోగా యానిమల్ చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో చాలా అసభ్యకరమైన సన్నివేశాలు, బూతు డైలాగులు ఉన్నాయి. దీనితో నెటిజన్లు అనసూయని ఈ వివాదంలోకి లాగుతూ యానిమల్ చిత్రం చూడలేదా.. ఇందులో అసభ్యకరమైన సన్నివేశాలు ఉన్నాయి స్పందించవా ? అంటూ కామెంట్స్ పడుతున్నారు.
అనసూయ విజయ్ దేవరకొండ సినిమా అయితేనే ఎక్కేస్తుంది.. మిగిలిన వాళ్ళవి పట్టించుకోదు అంటూ ట్రోల్ చేస్తున్నారు. శుక్రవారం విడుదలైన యానిమల్ చిత్రం బ్లాక్ బస్టర్ వసూళ్లతో దూసుకుపోతోంది.
మరి అనసూయ యానిమల్ చిత్రం గురించి స్పందిస్తుందా లేదా అనేది వేచి చూడాలి. అయితే అనసూయ ప్రస్తుతం తన సినిమాలపైనే ఫోకస్ చేస్తోంది.