
దేశ వ్యాప్తంగా ఎంతో ఉత్కంటగా ఎదురు చూస్తున్నారు ప్రభాస్ సలార్ రిలీజ్ గురించి. టాలీవుడ్‌తోపాటు వరల్డ్ వైడ్‌గా ఉన్న మూవీ లవర్స్ ఈసినిమాపై చాలా ఆసక్తిగా ఉన్నారు. పాన్ ఇండియా సినిమాగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న సలార్ ను కెజియఫ్ సినిమాల ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తుండగా.. పాన్ ఇండియా కమ్ గ్లోబల్ స్టార్ హీరో ప్రభాస్ టైటిల్ రోల్ చేస్తున్నారు.శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది ఈమూవీలో. ఇప్పటికే ఈసినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. సూపర్ ఫాస్ట్ గా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. తాజాగా సలార్ నుంచి ఓ అప్ డేట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
సలార్ కు సబంధించి అప్ డేట్ ఇచ్చింది శృతీ హాసన్.. ఈ భామ తాజాగా సలార్ అప్‌డేట్ అందించింది. సలార్‌లో తన పాత్రకు డబ్బింగ్ మొదలు పెట్టింది. సలార్ పాత్రకు శృతిహాసన్ డబ్బింగ్ చెప్పుకుంటున్న స్టిల్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అంతే కాదు నెట్టింట ట్రెండింగ్ అవుతోంది కూడా.
మాఫియా బ్యాక్ డ్రాప్ లో.. ఫుల్ లెన్త్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతోంది సలార్. అంతే కాదు రెండు పార్టులుగా రూపొందుతున్న ఈమూవీ ఫస్ట్ పార్ట్ Salaar Part-1 Ceasefire టీజర్ అందరిని ఆకట్టుకుంటోంది. యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో రాబోతున్న ఈమూవీపై ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. బాహుబలి తరువాత ప్రభాస్ సాలిడ్ హిట్ కొట్టలేదు. ఈసినిమాతో అయిన అది తీర్చుకోవాలి అని చూస్తున్నాడు. ఇక సలార్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఎంట్రీ.. ఆయన యాక్షన్ సీన్స్ గూస్‌బంప్స్ తెప్పించే విధంగా ఉంటాయని టాక్. ఇందులో కొంత మంది యాక్టర్స్ పేర్లు రివిల్ చేయకుండా సస్పెన్స్ లో పెట్టినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.
హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో మాలీవుడ్ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. సలార్ పార్ట్-1ను 2023 సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. కెజియఫ్ సినిమాలు నిర్మించిన విజయ్ కిరగందూర్ సలార్ ను కూడా తెరకెక్కిస్తున్నారు.