
2004 లో వచ్చిన చంద్రముఖి సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతోంది చంద్రముఖి2 మూవీ. ఆసినిమాను డైరెక్ట్ చేసిన పి.వాసు ఈసినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. రజనీకాంత్ సీక్వెల్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో.. ఈ ప్రాజెక్ట్ ను రాఘవ లారెన్స్ చేస్తున్నాడు హర్రర్ సినిమాలకు బ్రాండ్ గా మారిపోయాడు రాఘవ.. ఆ ఎక్స్ పీరియన్స్ తో ఈసినిమాను అద్భుతంగా చేస్తాడన్న నమ్మకం ఆడియన్స్ లో ఉంది.
ఇక రాఘవాతో పాట్ కంగనా రనౌత్ కాంబినేషన్ లో సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న చంద్రముఖి 2 ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకుంది. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్స్ జరుపుకుంటుంది. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ లో ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఇక ఒక నెల సమయమే ఉండడంతో ఇటీవలే మూవీ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు టీమ్. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది.
మొన్న మూవీ నుంచి రాఘవ లారెన్స్ ఫస్ట్ లుక్ ని..రీసెంట్ గా కంగనా ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసిన టీమ్.. తాజాగా ఈమూవీ ప్రమోషన్స్ పై గట్టిగా దృష్టి పెట్టారు. అగస్ట్ 25 చంద్రముఖి 2 ఆడియో లాంఛ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్టు తెలియజేస్తూ..రాఘవా లారెన్స్ కొత్త లుక్ ను అందరితో షేర్ చేసుకున్నాడు. ఇప్పుడీ లుక్స్ నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి. ఈవెంట్ నేపథ్యంలో మీ ఆశీస్సులు కావాలని అభిమానులను, శ్రేయోభిలాషులు, మూవీ లవర్స్‌ను కోరాడు. ఇక ఈమూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. తమిళంతో పాటు.. తెలుగు,కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా చంద్రముఖీ 2 రిలీజ్ కాబోతోంది.