Salaar Postpone : ప్రభాస్ ‘సలార్’ పోస్ట్ పోన్.? ఆ విషయంలో ప్రశాంత్ నీల్ అసంతృప్తి.!

Published : Sep 01, 2023, 03:39 PM IST
Salaar Postpone : ప్రభాస్ ‘సలార్’ పోస్ట్ పోన్.?  ఆ విషయంలో ప్రశాంత్ నీల్ అసంతృప్తి.!

సారాంశం

ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబోలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘సలార్’ ఈ నెలాఖరులో విడుదల కావాల్సి ఉంది. కానీ ఈ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ వాయిదా వేయబోతున్నారు. పలు కారణాలతో పోస్ట్ పోన్ కాబోతోందని తెలుస్తోంది.  

సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel)  - పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)   కాంబోలో వస్తున్న చిత్రం ‘సలార్’. Salaar Cease Fire పేరిట మొదటి భాగాన్ని రిలీజ్ కు సిద్ధం చేస్తున్నారు. అయితే, మొదటి నుంచి ఈ మూవీ విడుదల విషయంలో ఎలాంటి సందేహాలు లేవు. మేకర్స్ కూడా తొటిసారిగా ప్రకటించినట్టుగా సెప్టెంబర్ 28నే గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్టు ఆయా సందర్భాల్లో తెలిపారు. కానీ ప్రస్తుతం ఆ నిర్ణయం మారినట్టు తెలుస్తోంది. Salaar Postpone కానుందని గట్టిగా వినిపిస్తోంది. 

సలార్ టీజర్ విడుదలైన తర్వాత భారీ అంచనాలు పెరిగిన విషయం తెలిసిందే. దాంతో మార్కెట్ లోనూ ఈ చిత్రానికి భారీ డిమాండ్ వచ్చింది. ప్రీరిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్ అయ్యిందని ట్రేండ్ వర్గాలు అభిప్రాయాలు వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో అంచనాలకు తగ్గకుండా సినిమాను అందించేందుకు యూనిట్ పనిచేస్తోంది. అయితే, అవుట్ పుట్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కానీ Prashanth Neel సలార్ సీజీ షార్ట్స్ విషయంలో అసంతృప్తిగా ఉన్నారంట. వాటిని సరిచేసేందుకు ఇంకాస్తా సమయం అవసరం అవుతుందని తెలుస్తోంది. 

ఈ కారణంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెరిగే అవకాశం ఉంది. ఫలితంగా రిలీజ్ కు ఇంకాస్తా సమయం కావాల్సి ఉంటుంది. దీంతో సినిమాను వాయిదా వేయబోతున్నారని ఇండస్ట్రీలో టాక్ బయటికి వచ్చింది. సినిమా వాయిదా పడితే యూఎస్ ఏ ప్రీ సేల్స్  వృథాకానుందని, అంతకు మించి ఓవర్సీస్, ఇండియన్ బాక్సాఫీస్ కు మంచి డేట్ (సెప్టెంబర్ 28) కూడా మిస్ కానుందని అంటున్నారు. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి  ఉంది. సలార్ వాయిదా పడనుడటంతో అభిమానులు అప్సెట్ అవుతున్నారు. 

ఇక ఈ చిత్రంలో ప్రభాస్ కు జోడీగా శృతి హాసన్ (Shruti Haasan) నటించింది. రీసెంట్ గానే తన డబ్బింగ్ వర్క్ ను కూడా ప్రారంభించింది. విలన్స్ గా ఫృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు నటిస్తున్నారు. తమిళ నటి శ్రియా రెడ్డి కీలక పాత్ర పోషించింది. హోంబలే ఫిల్మ్స్  భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. త్వరలో ట్రైలర్ కూడా రానుందని, అది కూడా ‘జవాన్’ చిత్రంతో కలిసి వస్తుందని టాక్ నడుస్తోంది. మొత్తం మీద ఈ వారంలోనే ఈ బిగ్గెస్ట్ అప్డేట్ రాబోతుందని తెలుస్తోంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Actor Sreenivasan: ప్రముఖ నటుడు, దర్శకుడు శ్రీనివాసన్ కన్నుమూత.. 48 ఏళ్ల సినీ ప్రస్థానానికి ముగింపు
Bigg Boss Telugu 9: చివరి రోజు ఓటింగ్‌ తలక్రిందులు, పక్కా ప్లాన్‌ ప్రకారమే.. టాప్‌లో ఉన్నదెవరంటే?