బుర్రిపాలెంలో గౌతమ్‌ బర్త్ డే సెలబ్రేషన్‌.. పిల్లలను ఎలా సర్‌ప్రైజ్‌ చేశాడో తెలుసా?

Published : Sep 01, 2023, 02:37 PM IST
బుర్రిపాలెంలో గౌతమ్‌ బర్త్ డే సెలబ్రేషన్‌.. పిల్లలను ఎలా సర్‌ప్రైజ్‌ చేశాడో తెలుసా?

సారాంశం

గౌతమ్‌ తన బర్త్ డేని చాలా స్పెషల్‌గా మార్చుకున్నారు. ఈ బర్త్ డే తన సొంతూరు బుర్రిపాలెంలో సెలబ్రేట్‌ చేసుకున్నారు. తాత సూపర్‌స్టార్‌ కృష్ణ పుట్టిన ఊరైన బుర్రిపాలెంని మహేష్‌బాబు దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. 

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు తనయుడు గౌతమ్‌ ఘట్టమనేని గురువారం తన పుట్టిన రోజు(17)ని జరుపుకున్నారు. మహేష్‌బాబు, నమ్రత తనయుడికి గొప్పగా బర్త్ డే విషెస్‌ తెలియజేశారు. సోషల్‌ మీడియా ద్వారా వారుపెట్టిన పోస్టులు వైరల్‌ అయ్యాయి. అయితే గౌతమ్‌ తన బర్త్ డేని చాలా స్పెషల్‌గా మార్చుకున్నారు. ఈ బర్త్ డే తన సొంతూరు బుర్రిపాలెంలో సెలబ్రేట్‌ చేసుకున్నారు. తాత సూపర్‌స్టార్‌ కృష్ణ పుట్టిన ఊరైన బుర్రిపాలెంని మహేష్‌బాబు దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. 

ఆ ఊరిలో అన్నిరకాల వసతులు కల్పిస్తూ ఆదర్శంగా నిలిపే ప్రయత్నం చేస్తున్నారు. ఊరు అభివృద్ధితోపాటు స్కూల్‌ని కూడా అభివృద్ధి చేశారు. మంచి ఎడ్యూకేషన్‌ అందించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఏదైనా స్పెషల్‌ అకేషన్‌ వచ్చినప్పుడు ఊరికోసం ఎంతో కొంత సాయం చేస్తుంది మహేష్‌ ఫ్యామిలీ. ఇటీవల సితార బుర్రిపాలెంలో తన బర్త్ డే సెలబ్రేట్‌ చేసుకుంది. ఊరు విద్యార్థినీలకు సైకిళ్లని పంపిణి చేసింది. ఇప్పుడు గౌతమ్ కూడా పిల్లలకు తనవంతు సాయాన్ని అందించి సర్‌ప్రైజ్‌ చేశాడు. 

గౌతమ్‌ బుర్రిపాలెంలో తన 17వ బర్త్ డేని సెలబ్రేట్‌ చేసుకున్నారు. వారి మధ్య కేక్ కట్ చేసి వారికి తినిపించాడు. అనంతరం పిల్లలకు వారికీ స్పోర్ట్స్ కిట్స్ ని గిఫ్ట్స్ గా ఇచ్చాడు. అలాగే వినికిడి సమస్యతో బాధపడుతున్న కొంతమంది విద్యార్థులకు హియరింగ్ మెషిన్ కూడా అందజేశాడు. ఎంబీ ఫౌండేషన్‌ సారథ్యంలో ఆశ్రయకృతి స్వచ్చంద సంస్థకి చెందిన పిల్లలకు ఈ మిషన్లని అందజేశారు. ఇందుకు సంబంధించిన వీడియోని ఇటు తల్లి నమ్రత, అటు గౌతమ్ తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.  తన బర్త్ డే ఇలా జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందంటూ  గౌతమ్‌ పేర్కొన్నాడు. తనకుమారుడు ఇలాంటి మంచి పనిచేయడం పట్ల నమ్రత సంతోషాన్ని వ్యక్తం చేసింది. గర్వంగా ఉందంటూ ఆమె పేర్కొంది.  
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss 9 Finale Voting : కళ్యాణ్ పడాల , తనూజ మధ్య అసలు పోటీ.., ఫినాలే ఓటింగ్ లో ఎవరు ముందున్నారంటే?
Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ