‘హరిహర వీరమల్లు’ నుంచి అప్డేట్.. పవన్ ఫ్యాన్స్ కు బర్త్ డే ట్రీట్.. అదేంటంటే?

Published : Sep 01, 2023, 02:32 PM ISTUpdated : Sep 01, 2023, 06:28 PM IST
‘హరిహర వీరమల్లు’ నుంచి అప్డేట్.. పవన్ ఫ్యాన్స్ కు బర్త్ డే ట్రీట్.. అదేంటంటే?

సారాంశం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు రేపే కావడంతో అభిమానులు సెలబ్రేషన్స్ కు సిద్ధంగా ఉన్నారు. మరోవైపు ఆయన అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ నుంచి సర్ ప్రైజ్ లు కూడా రాబోతున్నాయి. తాజాగా ‘హరిహర వీరమల్లు’ నుంచి అప్డేట్ అందింది.   

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)  - దర్శకుడు  క్రిష్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘హరిహార వీరమల్లు’. (Hari Hara Veera mallu). మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. పీరియడ్ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై రెండేళ్లు దాటించింది. కానీ ఇప్పటికీ పూర్తి కాలేదు. ఈపాటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం అంతకంతకూ ఆలసమై ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. 

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఫోకస్ మొత్తం ‘ఓజీ’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పైనే పెట్టారు. దీంతో ‘హరిహర వీరమల్లు’ మరింత ఆలస్యం కానుందని తెలుస్తోంది. అందుకే కొద్దిరోజులుగా ఎలాంటి అప్డేట్స్ కూడా ఇవ్వడం లేదు. కానీ పవన్ కళ్యాణ్ పుట్టినరోజున మాత్రం సరికొత్త పోస్టర్ ను బర్త్ డే కానుకగా వదలబోతున్నట్టు తెలుస్తోంది. ఇందుకు టైమ్ కూడా ఫిక్స్ చేశారు. సెప్టెంబర్ 2న ఉదయం 12 :07 నిమిషాలకు పోస్టర్ రిలీజ్ కాబోతుందని తెలిపారు. మొఘల్ సామ్రాజ్యం కాలం నాటి కథగా చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఇక మళ్లీ ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడు రీస్టార్ట్ అవుతుందని ఆడియెన్స్  ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్ పైనా దృష్టి పెట్టడం, ఎన్నికల సమయం దగ్గరపడటంతో ‘హరిహర వీరమల్లు’ పునఃప్రారంభమయ్యేది ఎలక్షన్స్ తర్వాతే అంటున్నారు. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. చిత్రంలో నిధి అగర్వాల్, బాబీ డియోల్, నోరా ఫతేహి, విక్రమ్ జీత్ విర్క్, పూజిత పొన్నాడ నటిస్తున్నారు. చిత్ర షూటింగ్ దాదాపు 60 శాతం పూర్తైనట్టు తెలుస్తోంది. 

అలాగే పవన్ కళ్యాణ - సుజీత్ కాంబోలో వస్తున్న OG  నుంచి కూడా బర్త్ డే ట్రీట్ అందబోతోంది. రేపు ఉదయం 10 : 35 నిమిషాలకు సాలిడ్ అప్డేట్ ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు. ఇక ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి కూడా సాయంత్రం 6 :07 నిమిషాలకు అప్డేట్ విడుదలవుతుంది. మరోవైపు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా రేపు ‘గుండుంబా శంకర్’  మూవీ 4కే వెర్షన్ లో రీరిలీజ్ కాబోతోంది. ఇప్పటికే బుక్సింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఆయా షోలు హౌజ్ ఫుల్ అయ్యాయని తెలుస్తోంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sreenivasan: నటుడు శ్రీనివాసన్ ని ఆరాధించిన సూపర్‌ స్టార్‌ ఎవరో తెలుసా? ఏకంగా తన పాత్రకి డబ్బింగ్‌
కృష్ణ ను భయపెట్టిన చిరంజీవి సినిమా, మెగాస్టార్ కు చెక్ పెట్టడానికి సూపర్ స్టార్ మాస్టర్ ప్లాన్