ప్రభాస్.. ఓ వింటేజ్ కార్ స్టోరీ!

Published : Dec 22, 2018, 04:10 PM IST
ప్రభాస్.. ఓ వింటేజ్ కార్ స్టోరీ!

సారాంశం

'బాహుబలి' సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హీరో ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' సినిమాలో నటిస్తున్నాడు. సుజీత్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

'బాహుబలి' సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హీరో ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' సినిమాలో నటిస్తున్నాడు. సుజీత్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా తరువాత ప్రభాస్.. జిల్ ఫేం దర్శకుడు రాధాకృష్ణతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. పీరియాడిక్ రొమాంటిక్ డ్రామాగా ఈ సినిమాను చిత్రీకరించనున్నారు.

అయితే ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర ఎలా ఉండబోతుందనే విషయంపై ఓ వార్త చక్కర్లు కొడుతోంది. పాత్ర ప్రకారం ప్రభాస్ యూరోప్ లో వింటేజ్ కార్ల వ్యాపారిగా కనిపించనున్నాడట.

ఓ కారు అమ్మే విషయంలో జరిగిన సంఘటనతో సినిమా కథ మలుపు తిరుగుతుందట. ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డే కనిపించనుంది. గోపికృష్ణ మూవీస్ బ్యానర్ పై సినిమాను నిర్మించనున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

చివరి నిమిషంలో ప్లేట్ తిప్పేశారు, ఇమ్మాన్యుయేల్ కి మొండి చేయి.. బిగ్ బాస్ పై దుమ్మెత్తి పోస్తున్న రోహిణి
చిరంజీవి సినిమా హిట్ అని చెప్పుకున్నారు, కానీ అది ఫ్లాప్.. కుట్ర చేసినందుకు తగిన శాస్తి జరిగిందా ?