‘అంతరిక్షం’ రిజల్ట్.. అప్పుడే వరుణ్ తేజ్ కు దెబ్బకొట్టిందా ?

By Udayavani DhuliFirst Published Dec 22, 2018, 3:52 PM IST
Highlights

శుక్రవారం వస్తే సినిమా వాళ్ల జాతకాలు మారిపోతాయి. అప్పటిదాకా ప్లాఫ్ ల్లో ఉన్నవాడు హిట్ కొట్టి..ఓవర్ నైట్ స్టార్ అయిపోతాడు. అలాగే హిట్ ట్రాక్ లో ఉన్నవాడు ..ప్లాఫ్ కొట్టి వెనకపడి పోవచ్చు. వరుణ్ తేజ తాజా చిత్రం అంతరిక్షం నిన్న విడుదలైంది. 

శుక్రవారం వస్తే సినిమా వాళ్ల జాతకాలు మారిపోతాయి. అప్పటిదాకా ప్లాఫ్ ల్లో ఉన్నవాడు హిట్ కొట్టి..ఓవర్ నైట్ స్టార్ అయిపోతాడు. అలాగే హిట్ ట్రాక్ లో ఉన్నవాడు ..ప్లాఫ్ కొట్టి వెనకపడి పోవచ్చు. వరుణ్ తేజ తాజా చిత్రం అంతరిక్షం నిన్న విడుదలైంది. సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అనుకున్న స్దాయిలో వర్కవుట్ కాలేదు. 

మార్నింగ్ షో కే యావరేజ్ టాక్ వచ్చింది. ఓ వర్గానికే ఈ సినిమా పరిమితం అన్నారు. కమర్షియల్ గా ఈ సినిమా భాక్సాఫీస్ దగ్గర పెట్టిన పెట్టుబడి వెనక్కి తీసుకురావటం కష్టమనే అంచనాలకు సైతం ట్రేడ్ లో వచ్చేసాయి. ఈ టాక్ ప్రభావం వెంటనే వరుణ్ తేజ నెక్ట్స్ సినిమాపై పడిందని సమాచారం.

వరణ్ తేజ్ తన తదుపరి చిత్రంగా‘‘అయ్యారే, అప్పట్లో ఒకడుండేవాడు’’ దర్శకుడు సాగర్ కె చంద్రతో  చెయ్యాల్సి ఉంది.‘కంచె’ తరహాలోనే పీరియాడికల్ డ్రామాగా.. వరుణ్ తేజ్ సినిమాను తెరకెక్కించడానికి సిద్ధమయ్యాడు సాగర్ కె. చంద్ర. అందుకోసం నిజాం నాటి కథతో.. నిజాం కాలేజ్ బ్యాక్ డ్రాప్‌లో ఓ రొమాంటిక్ లవ్ స్టోరీని సిద్ధం చేశారు. 

ఈ కాంబినేషన్‌లో సినిమాను నిర్మించడానికి ‘14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్’ అధినేతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట.. '14 రీల్స్ ప్లస్' అనే కొత్త బ్యానర్‌పై ఈ సినిమాకోసం సన్నాహాలు మొదలుపెట్టారు. ఇక  రేపో మాపో సెట్స్ పైకి వెళ్లడమే తరువాయి అనుకుంటోన్న సమయంలో.. బడ్జెట్ ఎస్టిమేషన్ దర్శకుడు ఇవ్వగా ప్రాజెక్టు డైలమోలో పడిందట. 

దాదాపు రూ.33 కోట్ల బడ్జెట్ ఎస్టిమేషన్ ఇచ్చాడట డైరెక్టర్ సాగర్ కె. చంద్ర. అయితే ఆ ఎస్టిమేషన్ చూసి  వరుణ్ లేటెస్ట్ మూవీ ‘అంతరిక్షం’ భారీ విజయం సాధిస్తే ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని, లేకపోతే మధ్యలోనే డ్రాప్ అవ్వడం బెటరని నిర్ణయించుకున్నారట. ఈ నేపధ్యంలో అంతరిక్షం టాక్ తేడాగా ఉండటంతో ఈ ప్రాజెక్టుపై ఖచ్చితంగా ప్రభావం పడుతుందని భావిస్తున్నారు. 

 

click me!