'పడి పడి లేచే మనసు' ఫస్ట్ డే కలెక్షన్లు!

Published : Dec 22, 2018, 03:46 PM IST
'పడి పడి లేచే మనసు' ఫస్ట్ డే కలెక్షన్లు!

సారాంశం

శర్వానంద్, సాయి పల్లవి జంటగా నటించిన రొమాంటిక్ లవ్ స్టోరీ 'పడి పడి లేచే మనసు' శుక్రవారం నాడు ప్రేక్షకుల ముదుకు వచ్చింది. విడుదలకు ముందు ఈ సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి

శర్వానంద్, సాయి పల్లవి జంటగా నటించిన రొమాంటిక్ లవ్ స్టోరీ 'పడి పడి లేచే మనసు' శుక్రవారం నాడు ప్రేక్షకుల ముదుకు వచ్చింది. విడుదలకు ముందు ఈ సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. కానీ సినిమా హిట్ టాక్ మాత్రం తెచ్చుకోలేకపోయింది.

సినిమాపై ఏర్పడిన బజ్ తో మొదటిరోజు మంచి ఓపెనింగ్సే రాబట్టింది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా రూ.1.80 కోట్ల షేర్ ని రాబట్టింది. శర్వా కెరీర్ లో ఇది సెకండ్ హయ్యెస్ట్ ఓపెనింగ్స్ అనే చెప్పాలి.

అతడు నటించిన 'మహానుభావుడు' సినిమా తొలిరోజు రూ.2.60 కోట్లను రాబట్టింది. మూడు సినిమాలతో పోటీ పడి విడుదలైన 'పడి పడి లేచే మనసు' సినిమాకి ఆడియన్స్ నుండి మిశ్రమ స్పందన లభిస్తోంది. లాంగ్ రన్ లో ఈ సినిమా ఎంతవరకు కలెక్ట్ చేస్తుందో చూడాలి!

ఏరియాల వారీగా సినిమా కలెక్షన్లు.. 
నైజాం........................................... 0.67 కోట్లు 
సీడెడ్........................................... 0.24 కోట్లు 
ఉత్తరాంధ్ర................................... 0.23 కోట్లు 
గుంటూరు..................................... 0.30 కోట్లు 
ఈస్ట్...............................................0.15 కోట్లు 
వెస్ట్................................................0.08 కోట్లు 
కృష్ణ...............................................0.10 కోట్లు
నెల్లూరు..........................................0.05 కోట్లు 

మొత్తం కలుపుకొని సినిమా రాబట్టింది 1.82 కోట్లను రాబట్టింది.  

PREV
click me!

Recommended Stories

Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు