యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నూనూగు మీసాల కుర్రాడిగా ఈశ్వర్ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. పెదనాన్న కృష్ణంరాజు అండదండలతో ప్రభాస్ టాలీవుడ్ లో హీరోగా పరిచయం అయ్యాడు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నూనూగు మీసాల కుర్రాడిగా ఈశ్వర్ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. పెదనాన్న కృష్ణంరాజు అండదండలతో ప్రభాస్ టాలీవుడ్ లో హీరోగా పరిచయం అయ్యాడు. అయితే తొలి రెండు చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. ప్రభాస్ కూడా తన స్పెషాలిటీ నిరూపించుకోలేదు.
ప్రభాస్ కి సరైన హిట్ కావాలి అని ఎదురుచూస్తున్న తరుణంలో పర్ఫెక్ట్ కాంబినేషన్ కుదిరింది. ఎం ఎస్ రాజు నిర్మాతగా, శోభన్ దర్శకత్వంలో, దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో ఒక చిత్రం సెట్ అయింది. ఈ మూవీ ఏదో ఈ పాటికే అర్థం అయిపోయి ఉంటుంది.. అదే వర్షం మూవీ. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్. ఒక మంచి లవ్ అండ్ యాక్షన్ మూవీ తీద్దాం అని మొదలు పెట్టారు. రిలీజ్ కి ముందు మ్యూజిక్ అయితే సంచలనం సృష్టించింది.
ఆ సమయంలో ఎక్కడ చూసినా వర్షం మూవీ పాటలే వినిపించేవి. దీనితో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. 2004 సంక్రాంతికి సందర్భంగా జనవరి 14న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఈ చిత్ర రిలీజ్ గురించి ప్రభాస్.. అన్ స్టాపబుల్ షోలో బాలయ్యతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వర్షం చిత్రాన్ని ఎం ఎస్ రాజుగారు సంక్రాంతికి రిలీజ్ చేయాలి అని అన్నారు. అప్పటికే మీరు నటించిన లక్ష్మి నరసింహ, చిరంజీవి గారి అంజి చిత్రం రెండూ సిద్ధంగా ఉన్నాయి.
దీనితో నేను ఎంఎస్ రాజుతో చిరు బాలయ్య మధ్యలో మన సినిమా వద్దులే సార్ తర్వాత చూసుకుందాం అని చెప్పా. లేదు రిలీజ్ చేయాల్సిందే అని అన్నారు. వెంటనే బాలయ్య మాట్లాడుతూ మీరు రాజులు కదా మాట వినరు అంటూ సరదాగా సెటైర్ వేశారు. దీనితో ప్రభాస్ నవ్వుకున్నారు. మొత్తానికి వర్షం చిత్రాన్ని రిలీజ్ చేసి కుంభస్థలాన్ని బద్దలు కొట్టావ్ అని బాలయ్య ప్రశంసించారు. తనకి దక్కిన ఫస్ట్ బ్లాక్ బస్టర్ వర్షం చిత్రం అని ప్రభాస్ తెలిపాడు. వర్షం చిత్రంతో ప్రభాస్, గోపీచంద్ ఇద్దరూ మంచి స్నేహితులుగా మారారు. త్రిష కెరీర్ కూడా ఒక్కసారిగా ఈ చిత్రంతో ఊపందుకుంది. వర్షం ప్రభాస్ కెరీర్ లో మెమొరబుల్ మూవీ. వర్షం చిత్రతో పాటు విడుదలైన బాలయ్య లక్ష్మి నరసింహ కూడా విజయం సాధించింది. కానీ చిరంజీవి అంజి చిత్రం నిరాశ పరిచింది.
Also Read : మహేష్ బాబు వాయిస్ ఇంత దారుణంగా ఉంటుందా, స్టార్ హీరోయిన్ కి షాక్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే
ఇప్పుడు ప్రభాస్ రేంజ్ ఏంటో అందరికి తెలిసిందే. బాలీవుడ్ అగ్రహీరోలని సైతం తలదన్నేలా ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా ఎదిగారు. చివరగా ప్రభాస్ నటించిన కల్కి చిత్రం పాన్ ఇండియా వ్యాప్తంగా ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఏకంగా 1100 కోట్ల సాధించి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
వర్షం తర్వాత ప్రభాస్ కి ఛత్రపతి, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి లాంటి హిట్స్ పడ్డాయి. ప్రభాస్ కెరీర్ ని పూర్తిగా మార్చేసిన చిత్రం మాత్రం బాహుబలి అని చెప్పొచ్చు. ప్రభాస్ బాహుబలితో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ప్రభాస్ తదుపరి చిత్రాలపై ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది. కల్కి చిత్రానికి పార్ట్ 2 రావాల్సి ఉంది. అదెప్పుడు అనేది క్లారిటీ లేదు. ఇదిలా ఉండగా ప్రభాస్ ప్రస్తుతం రాజా సాబ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. మారుతీ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. హారర్ కామెడీ జోనర్ లో ప్రభాస్ చేస్తున్న ప్రయత్నం ఇది.
అదే విధంగా సలార్ 2 కూడా రావలసి ఉంది. మరోవైపు ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో బ్రిటిష్ నేపథ్యంలో భారీ యాక్షన్ చిత్రాన్ని ప్రారంభించారు. ఈ చిత్రం పూర్తయ్యాక సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ చిత్రంలో నటించాల్సి ఉంది. సో ఎలా చూసినా ప్రభాస్ వచ్చే ఐదేళ్లు బిజీ గా ఉంటాడు. రీల్ లైఫ్ లో వర్షం, డార్లింగ్ లాంటి ప్రేమ చిత్రాల్లో నటించిన ప్రభాస్.. రియల్ లైఫ్ లో మాత్రం తన జోడీని ఇంకా వెతుక్కోలేదు. ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న గత కొన్నేళ్లుగా సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయింది.