Bigg Boss Telugu5; సన్నీ టైటిల్‌ విన్నర్.. షణ్ముఖ్‌ ప్లేస్‌ అదే.. కన్ఫమ్‌ చేస్తున్న ప్రిడిక్షన్స్..

By Aithagoni RajuFirst Published Nov 28, 2021, 8:11 AM IST
Highlights

హౌజ్‌ మేట్ ఫ్యామిలీ మెంబర్స్ తమ వారిని విన్నర్‌గా తేల్చారు. అదే సమయంలో మిగిలిన నలుగురుఎవరో కూడా వెల్లడించారు. ఇందులో ప్రధానంగా సన్నీ, శ్రీరామ్‌, రవి, మానస్‌, షణ్ముఖ్‌ టాప్‌ 5లో ఉన్నట్టు తెలుస్తుంది. 

బిగ్‌బాస్‌ తెలుగు 5(Bigg Boss Telugu 5)వ సీజన్‌ చివరి దశకు చేరుకుంది. నేటి(ఆదివారం)తో 12 వారాలు పూర్తి కావస్తున్నాయి. ఈ రోజు ప్రియాంక, కాజల్‌లో ఒకరు ఎలిమినేట్‌ అవుతారని తెలుస్తుంది. అయితే నిన్న జరిగిన ఎపిసోడ్‌లో వచ్చిన గెస్ట్ లు, వారి కుటుంబ సభ్యులు ఈ సీజన్‌ విన్నర్స్ ఎవరో తేల్చేశారు. ఊహించి చెప్పినా చాలా వరకు ఒక్క పేరు అటు ఇటుగా ఉన్న మిగిలిన లిస్ట్ మాత్రం కరెక్ట్ గానే ఉందనే టాక్‌ వినిపిస్తుంది. హౌజ్‌ మేట్ ఫ్యామిలీ మెంబర్స్ తమ వారిని విన్నర్‌గా తేల్చారు. అదే సమయంలో మిగిలిన నలుగురుఎవరో కూడా వెల్లడించారు. ఇందులో ప్రధానంగా సన్నీ(Sunny), శ్రీరామ్‌, రవి(Ravi), మానస్‌, షణ్ముఖ్‌(Shanmukh) టాప్‌ 5లో ఉన్నట్టు తెలుస్తుంది. 

బిగ్‌బాస్‌ 5 ప్రిడిక్షన్స్ కూడా వీటినే కన్ఫమ్‌ చేస్తున్నాయి. సన్నీ టైటిల్‌ విన్నర్‌ అని చాలా మంది చెప్పారు. సోషల్‌ మీడియాలోనూ ఇదే టాక్‌ వైరల్‌ అవుతుంది. అయితే విపరీతమైన ఫాలోయింగ్‌ ఉన్న షణ్ముఖ్‌ స్థానమేంటో అర్థం కావడం లేదనే టాక్‌ వస్తుంది. ఆయన టాప్‌ 5లో ఉంటారని చాలా మంది చెప్పారు. విన్నర్‌గా మాత్రం ఆమె ప్రియురాలు దీప్తి సునైనా చెప్పింది. అదే సమయంలో ఆమె ఇచ్చిన సిగ్నల్స్ కూడా ఇప్పుడు ఆసక్తిని క్రియేట్‌ చేస్తుంది. ఆమె చేసిన ఫింగర్‌ సైగల ప్రకారం షణ్ముఖ్‌ రెండో స్థానంలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 

మరోవైపు టాప్‌ 5లో శ్రీరామ్‌, రవి, మానస్‌ ఉంటారని టాక్‌. ఈ సీజన్‌లో మహిళలు టాప్‌ 5లో చోటు దక్కించుకోవడం కష్టమే అంటున్నారు. గత వారంలో టాప్‌ 5లో హారికా, అరియానా ఉన్నారు. ఊహించినట్టుగానే అభిజిత్‌ టైటిల్‌ విన్నర్‌ అయ్యారు. అయితే ఈ సారి రవి టైటిల్‌ విన్నర్‌ అని మొదట్నుంచి ప్రచారం జరిగింది. కానీ గేమ్‌ రీత్యా, ఆదరణ రీత్యా, ఎంటర్‌టైనింగ్‌ రీత్యా సన్నీ విన్నర్‌ కాబోతున్నాడని ఊహారాయుళ్లు జోస్యం చెబుతున్నారు. సిరి, కాజల్‌, ప్రియాంకలు ఈ మూడు వారాల్లో ఎలిమినేట్‌ కాబోతున్నారని, బాయ్స్ మిగిలిపోతారని చెబుతున్నారు. మరి ఊహారాయుళ్ల జోస్యం నిజమవుతుందా? ఊహించినట్టుగానే సన్నీ టైటిల్‌ సాధిస్తాడా? రవి, షణ్ముఖ్‌ ఏ రేంజ్‌లో పోటీ ఇస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 

బిగ్‌బాస్‌ తెలుగు 5వ సీజన్‌ సెప్టెంబర్‌ 5న ప్రారంభమైన విషయం తెలిసిందే. 84రోజులకు చేరుకుంది. ఇంకా మూడు వారాలున్నాయి. ఇప్పటి వరకు హౌజ్‌ నుంచి సరయు, ఉమాదేవి, లహరి, నటరాజ్‌ మాస్టర్‌, హమీద, స్వేత వర్మ, లోబో, ప్రియా, విశ్వ, అనీ మాస్టర్లు ఎలిమినేట్‌ అయ్యారు. జెస్సీ అనారోగ్యం కారణంగా హౌజ్‌ నుంచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. 

also read: సన్నీ పక్కా.. సిరి ప్రియుడు రాగానే బిజియంతో మోతెక్కించిన బిగ్ బాస్

click me!