Prabhas: మూడు నాలుగు సినిమాలు ప్లాన్ చేస్తున్నా... 300 రోజులు పనిచేస్తున్నా

Published : Mar 07, 2022, 08:21 AM IST
Prabhas: మూడు నాలుగు సినిమాలు ప్లాన్ చేస్తున్నా... 300 రోజులు పనిచేస్తున్నా

సారాంశం

బాహుబలి చిత్రాలకు ముందు వరకు ప్రభాస్ ఏడాదికి కనీసం ఒక చిత్రం చేసేవారు. ప్రస్తుతం ఆయన నుండి రెండేళ్లకు ఓ చిత్రం కూడా కష్టమైపోతుంది. ఇది ఫ్యాన్స్ ని తీవ్ర అసహనానికి గురి చేస్తుండగా, ప్రభాస్ స్పందించారు.

రాధే శ్యామ్ (Radhe Shyam)చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటున్న ప్రభాస్ యాంకర్ ప్రశ్నకు సమాధానంగా... తన సినిమాలు ఆలస్యం కావడానికి కారణం చెప్పారు. గతంలో ఏడాదికి కనీసం ఒక మూవీ విడుదల చేసేవాడిని. బాహుబలి తర్వాత అన్నీ పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. అనేక కారణాలతో సినిమాలు ఆలస్యం అవుతున్నాయి. కోవిడ్ కారణంగా రాధే శ్యామ్ ఆలస్యమైంది. ఆదిపురుష్ షూటింగ్ పూర్తి చేశాను.కోవిడ్ కారణంగానే ఆదిపురుష్ సీజీ వర్క్ కూడా లేటైంది.   సలార్ ఓ ప్రక్క షూటింగ్ జరుపుకుంటుంది. ఇంకో మూవీ కూడా ప్లాన్ చేస్తున్నాను. 

పెద్ద చిత్రాలు కావడంతో షూటింగ్ బాగా ఆలస్యం అవుతుంది. అందుకే ఒకేసారి మూడు నాలుగు సినిమాలు ప్లాన్ చేస్తున్నాను. నేను మూడు వందల రోజులు కష్టపడుతున్నాను. కానీ టైం కుదరడం లేదు, సినిమాలు ఆలస్యం అవుతున్నాయి.. అంటూ ప్రభాస్ (Prabhas)వివరణ ఇచ్చారు. ఆగస్టులో విడుదల కావాల్సిన ఆదిపురుష్ (adhipurush)2023 సంక్రాంతికి వాయిదా పడిన విషయం తెలిసిందే. బహుశా ఈ ఏడాది సలార్ విడుదల ఉండవచ్చు. ఇక దర్శకుడు నాగ్ అశ్విన్ తో చేస్తున్న ప్రాజెక్ట్ కే సెట్స్ పైకి వెళ్ళింది. రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. 

వీటితో పాటు ప్రభాస్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ అనే మూవీ ప్రకటించారు. అయితే ఈ చిత్రం కంటే ముందు డైరెక్టర్ మారుతీ తో చేస్తున్న చిత్రం సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా... హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్స్ నిర్మిస్తున్నారని సమాచారం. కాబట్టి ప్రభాస్ శక్తి వంచన లేకుండా పని చేస్తున్నారు. తన అభిమానులను అలరించడం కోసం నాన్ స్టాప్ గా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. అనుకోని పరిస్థితులు ఆయన సినిమాల ఆలస్యానికి కారణం అవుతున్నాయి. 

ఇక రాధే శ్యామ్ మార్చి 11న గ్రాండ్ రిలీజ్ కానుంది. దర్శకుడు రాధాకృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పీరియాడిక్ ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ గా రాధే శ్యామ్ తెరకెక్కింది. పూజా హెగ్డే (Pooja hegde)హీరోయిన్ గా నటిస్తుండగా సత్యరాజ్, భాగ్యశ్రీ కీలక రోల్స్ చేస్తున్నారు. ప్రేమకు విధికి మధ్య నడిచే సంఘర్షణగా రాధే శ్యామ్ చిత్రం ఉండనుంది. ప్రభాస్ హస్తసాముద్రికుడిగా ఓ భిన్నమైన పాత్ర చేస్తున్నారు. లవర్ బాయ్ లుక్ లో ఆయన హ్యాండ్సమ్ గా ఉన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: భరణి ఎలిమినేటెడ్.. టాప్ 5 సభ్యులు వీరే, ప్రియురాలి కోసం ఇమ్ము చేయబోతున్న త్యాగం ఇదే
రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు