Radhe Shyam: “రాధే శ్యామ్” కి టైటానిక్ కి అందులో మాత్రమే పోలిక,తేల్చేసిన టీమ్

Surya Prakash   | Asianet News
Published : Mar 07, 2022, 06:14 AM IST
Radhe Shyam: “రాధే శ్యామ్” కి టైటానిక్ కి అందులో మాత్రమే పోలిక,తేల్చేసిన టీమ్

సారాంశం

ఈ చిత్రం కి సంబంధించిన పోస్టర్స్, వీడియో లు, పాటలు విడుదలై ప్రేక్షకులని, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. చిత్ర యూనిట్ సైతం ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంటోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ చిత్రం ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. వరుస ఇంటర్వూ లు, కార్యక్రమాల తో బిజీగా ఉన్నారు.


 ప్రభాస్.. పూజా హెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్ మూవీపై డార్లింగ్ ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. మార్చి 11న అభిమానుల ఆశ తీరబోతుంది.   రిలీజ్ టైమ్ దగ్గర పడుతున్న టైమ్ లో చిత్రం ప్రమోషన్స్ పెంచారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రం కు హాలీవుడ్ బ్లాక్ బస్టర్ టైటానిక్ కు పోలికలు ఉన్నాయని మరో ప్రక్కన ప్రచారం జరుగుతోంది. అయితే అందులో నిజమెంత అనేది అభిమానులు, మీడియాకు ఆసక్తికరమైన చర్చగా మారింది.  అందుకు కారణం లేకపోలేదు...

 రీసెంట్ గా విడుదల చేసిన రిలీజ్ యాక్షన్ ట్రైలర్  చివర్లో వచ్చే షిప్ ఎపిసోడ్   ప్రత్యేకంగా కనిపించగా సినిమాలో ఇదే హైలెట్ కాబోతుందని చెప్పుకుంటున్నారు. రాధే శ్యామ్ యాక్షన్ సినిమా ఏ మాత్రం కాదని మేకర్స్ ముందు నుండీ ప్రిపేర్ చేస్తూ వస్తున్నారు. రాధేశ్యామ్ కంప్లీట్ డిస్టినీని నమ్మే కథతో కూడిన లవ్ స్టోరీ. అలాంటి లవ్ స్టోరీలో షిప్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది టైటానిక్ మాత్రమే. రాధేశ్యామ్ లో షిప్ సీన్ కూడా ఇప్పుడు టైటానిక్ తో పోలిక పెడుతూ టాక్ మొదలైంది. క్లైమాక్స్ లో ఓ భారీ షిప్ మునిగిపోతుందని చెప్పుకుంటున్నారు. ఈ విషయమై దర్శకుడు, హీరోయిన్ క్లారిటి ఇచ్చారు తమ ఇంటర్వూలలో .

హీరోయిన్ పూజ మాట్లాడుతూ...రాధేశ్యామ్ సినిమాని అలాంటి గ్రేట్ సినిమాతో పోల్చడం గొప్ప విషయం. ఇప్పుడు మీరు చూస్తే ఒకవేళ షిప్ గాని మునిగిపోతే అది టైటానిక్ అంటారు..  కానీ ఇది అయితే టైటానిక్ కాదు. జస్ట్ షిప్ ఉందని పోలిక మాత్రమే అని తేల్చి చెప్పారు.

మరో ప్రక్క దర్శకుడు రాధాకృష్ణ కుమార్ మాట్లాడుతూ..టైటానిక్ సినిమా క్లైమాక్స్ కు రాధేశ్యామ్ క్లైమాక్స్ కు ఏ పోలిక ఉండదని అన్నారు. టైటానిక్ సినిమాలో యాంటీ క్లైమాక్స్ ఉంటుంది కానీ రాధేశ్యామ్ లో అలాంటిదేమీ ఉండదని అన్నారు.

అదే సమయంలో ఈ సినిమాకు పనిచేసిన ఆస్కార్ విన్నర్ రసూల్ పూకుట్టి రాధే శ్యామ్ సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా క్లైమాక్స్ టైటానిక్ సినిమాను మించి ప్రేక్షకులను థ్రిల్ చేస్తుందని.. అంతకి మించి బాధను కలిగిస్తుందని కామెంట్ చేశారు. దీంతో రాధేశ్యామ్ సినిమా క్లైమాక్స్ గురించి ఆ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్ చెప్పడంతో ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్ గా మారిపోయింది.

ఈ చిత్రం కి సంబంధించిన పోస్టర్స్, వీడియో లు, పాటలు విడుదలై ప్రేక్షకులని, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. చిత్ర యూనిట్ సైతం ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంటోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ చిత్రం ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. వరుస ఇంటర్వూ లు, కార్యక్రమాల తో బిజీగా ఉన్నారు. సాహో చిత్రం తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ చిత్రంలో ప్రభాస్‌ లవర్‌బాయ్ గా, హస్తకళా నిపుణుని పాత్రలో నటించారు. రాధాకృష్ణకుమార్‌ దర్శకత్వం వహించగా, వంశీ ప్రమోద్‌, ప్రసీద ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈ సినిమాకు సంబంధించి సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఓ రకంగా చెప్పుకోవాలంటే.. ఒక సినిమాకు రెండు భాషల్లో వేర్వేరు సంగీత దర్శకులు పనిచేయడం సినిమా హిస్టరీలోనే ఇదే తొలిసారి. ఈ సినిమా కోసం చాలా మంది సంగీత దర్శకులు పనిచేశారు. జస్టిన్‌ ప్రభాకరన్‌, అర్జిత్‌ సింగ్‌, మిథున్‌, అనూ మాలిక్‌, మనన్‌ భరద్వాజ్‌, జబిన్‌ నౌతీయల్‌, మనోజ్‌ ముంటాషిర్‌, కుమార్‌, రష్మీ విరాగ్‌ బృందం అంతా కలిసి సౌత్‌, నార్త్‌ వర్షన్స్‌కు రాధే శ్యామ్‌ సినిమాకు అద్భుతమైన క్లాసిక్‌ సంగీతం అందిస్తున్నారు.

వింటేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఇట‌లీలో జ‌రిగే ప్రేమ‌క‌థగా "రాధే శ్యామ్" చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు దర్శకుడు కెకె రాధాకృష్ణ కుమార్. గోపీకృష్ణ మూవీస్‌, యువీ క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పూజా హెగ్డే హీరోయిన్. 60ల కాలం నాటి ఇటలీ నేపథ్యంగా సాగే ప్రేమకథతో రూపొందుతోంది.  ఇది కాలం, జాతకాలతో ముడిపడి ఉన్న ప్రేమ  కథ. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి