
రాధేశ్యామ్ కోసం యంగ్ రెబల్ స్టార్ ప్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ నిరీక్షణ ఇప్పటిది కాదు. నాలుగేళ్ల నుంచి ఎదురుచూస్తూనే ఉన్నారు. వారి కోసం తమ నాలుగేళ్ల శ్రమను వీడియో రూపంలో రిలీజ్ చేశారు రాధేశ్యామ్ టీమ్.
రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో రాధేశ్యామ్ టీమ్ ప్రమోషన్స్ జోరు పెంచారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నరాధేశ్యామ్ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో.. వరల్డ్ వైడ్ గా ఎట్టకేలకు మార్చి 11 న రిలీజ్ కానుంది. దాంతో ప్రమోషనల్ వీడియోస్ తో మూవీ టీమ్ హడావిడి చేస్తుంది. రోజుకో సర్ ప్రైజ్ తో సందడి చేస్తుంది టీమ్.
ఇక మూవీ టీమ్ వరుస అప్డేట్లు, ఇంటర్వ్యూలతో ఫుల్ బిజీబిజీగా మారింది. ఇప్పటికే రాధేశ్యామ్ మూవ నుంచి రిలీజైన ట్రైలర్స్, సాంగ్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సాంగ్స్, టీజర్,ఇంట్రడక్షన్ వీడియోస్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజగా ఈ సినిమా మేకింగ్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. రాధేశ్యామ్ సాగా పేరుతో రిలీజ్ చేసిన ఈ మేకింగ్ వీడియోలో నాలుగేళ్ల్లుగా మూవీ టీమ్ సినిమా కోసం పడిన శ్రమను.. కష్టాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు.
యూరప్ లో ఎంతో అందమైన లొకేషన్స్, ఆ మంచులో మూవీ టీమ్ చిక్కులు. అయినా సరే అక్కడే ఇబ్బంది పడుతూ షూటింగ్ చేయడం.. మధ్యలో కరోనా వలన షూటింగ్ ఆగిపోవడంతో పాటు.. ఫారెన్ షూటింగ్ షెడ్యూల్స్ విశేషాలు.. ఇండియాలో వేసిన స్పెషల్ సెట్స్ .. భారీగా వేసిన ఇటాలీ సెట్ తో పాటు షూటింగ్ స్పాట్స్ కు సంబంధించిన విశేషాలను బ్రీఫ్ గా చూపించే ప్రయత్నం చేశారు.
అంతే కాదు ఈ మూవీ షూటింగ్ లో ప్రభాస్ బాగా ఎంజాయ్ చేసినట్లు వీడియోలో కనిపిస్తుంది. సెట్ లో రాజమౌళి, కార్తికేయ హంగామా హైలైట్ గా నిలిచింది. ఏదిఏమైనా ఎన్నో అడ్డంకులను, అవాంతరాలను దాటుకొని రాధేశ్యామ్ మూవీ ఎట్టకేలకు రిలీజ్ కాబోతోంది. ప్రస్తుతం ఈ మేకింగ్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ప్రభాస్ జ్యోతీష్యూడిగా కనిపించబోతున్నాడు.